హైదరాబాద్ పర్యటనలో ఉన్న భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను ఇవాళపలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కలిశారు. రాజ్‌భవన్‌లో జస్టిస్ రమణను కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జస్టిస్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు.
సీజేఐగా పదవీ బాధ్యతలు చేపట్టిన జస్టిస్ రమణకు కేంద్రమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుబిడ్డ అత్యున్నత పదవిని అలంకరించడం అభినందనీయమని కిషన్‌రెడ్డి కొనియాడారు.
ఇదీ చదవండి: E Challans:ఆ వాహనంపై సెంచరీకి చేరువలో ఈ-చలాన్లు