ETV Bharat / state

central objects on ap schemes names : కేంద్ర పథకాల పేర్లు ఇష్టమొచ్చినట్టు మార్చడం కుదరదు: స్మృతి ఇరానీ

central objects on ap schemes names : కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను రాష్ట్రాలు తమకు నచ్చినట్టు మార్చడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర పథకాలకు ఏపీలో జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పేర్లు పెట్టడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది.

author img

By

Published : Dec 3, 2021, 10:24 PM IST

central objects
central objects

central objects on ap schemes names : ఆంధ్రప్రదేశ్​లో.. కేంద్ర ప్రాయోజిత పథకాల పేర్లు మార్చడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర పథకాల పేర్లను రాష్ట్రాలు తమకు నచ్చినట్లు మార్చడం కుదరదని స్పష్టం చేసింది. కేంద్ర పథకాలకు ఏపీలో జగనన్న గోరుముద్ద, జగనన్న పాలవెల్లువ, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పేర్లు పెట్టడం సరికాదని పేర్కొంది. 2021-2022 ఏడాది కింద ఐసీడీఎస్, ఐసీపీఎస్‌ పథకాలకు ఇచ్చిన 187 కోట్లకు లెక్కలు చూపాలని ఆదేశించింది.

ఎంపీ రఘురామ ఫిర్యాదు.. స్పందించిన కేంద్రమంత్రి

MP Raghu Rama letter to central minister : ఏపీలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చటంపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్రమంత్రి.. రాష్ట్రాలు తమకు నచ్చిన పేర్లు పెట్టడంపై అభ్యంతరం తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు జగన్ పేరు పెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలని కోరారు. ఎంపీ రఘురామ రాసిన లేఖకు సమాధానం చెప్పాలని.. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆమె పేర్కొన్నారు.

ఇదీ చూడండి: KTR Tweet to PM: ప్రధానికి కేటీఆర్​ ట్వీట్​.. జాతీయహోదా ఇవ్వాలని విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.