ETV Bharat / state

Gazette On KRMB, GRMB: బోర్డుల పరిధిపై కార్యాచరణ వేగవంతం.. ఇంజినీర్ల కేటాయింపు - తెలంగాణ వార్తలు

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి గెజిట్(Gazette On KRMB, GRMB) నోటిఫికేషన్‌ అమలు కార్యాచరణను కేంద్రం వేగవంతం చేసింది. రెండు బోర్డులకు ఇద్దరు చొప్పున ఇంజినీర్లను కేటాయించింది.

Gazette On KRMB, GRMB, central government on krmb and grmb
బోర్డుల పరిధిపై కార్యాచరణ వేగవంతం, ఇంజినీర్ల కేటాయింపు
author img

By

Published : Sep 13, 2021, 1:04 PM IST

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధికి సంబంధించిన గెజిట్(Gazette On KRMB, GRMB) నోటిఫికేషన్ అమలు కార్యాచరణను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. నోటిఫికేషన్ అమలు కోసం బోర్డులకు కేంద్ర జలశక్తిశాఖ ఇంజినీర్లను కేటాయించింది. రెండు బోర్డులకు ఇద్దరు చొప్పున చీఫ్ ఇంజినీర్లను కేటాయించింది.

గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు(GRMB) ఎం.కె.సిన్హా, జి.కె.అగర్వాల్‌ను కేటాయించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు(KRMB) టి.కె.శివరాజన్, అనుపమ్ ప్రసాద్‌లను కేటాయించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుల అధీనంలోకి తీసుకునే ప్రక్రియలో చీఫ్ ఇంజినీర్లు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: CM KCR: యాదాద్రికి సీఎం.. 17న చినజీయర్​ స్వామితో కలిసి పర్యటన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.