ETV Bharat / state

Rock Phosphate: రాక్ ఫాస్ఫేట్​పై కేంద్రం దృష్టి.. దేశీయంగా తవ్వితీయాలని నిర్ణయం

author img

By

Published : Jul 1, 2021, 9:37 AM IST

రసాయన ఎరువుల తయారీలో కీలక ముడి సరకైన రాతి భాస్వరాన్ని దేశీయంగా ఉత్పత్తి చేయాలని కేంద్ర ఎరువుల శాఖ నిర్ణయించింది. భూగర్భంలో రాక్‌ఫాస్ఫేట్‌ నిల్వలు ఎక్కడున్నాయనే అశంపై కేంద్ర గనులు, భూ భౌతిక సర్వే ఆఫ్‌ ఇండియా శాఖలతో ఎరువుల శాఖ చర్చిస్తోంది. వారి సూచనలతో పలు రాష్ట్రాల్లో తవ్వకాలకు ప్రణాళికను సిద్ధంచేస్తోంది.

రాక్‌ఫాస్ఫేట్‌ ఉత్పత్తి
రాక్‌ఫాస్ఫేట్‌ ఉత్పత్తి

రసాయన ఎరువుల తయారీలో కీలక ముడి సరకు రాక్‌ ఫాస్ఫేట్‌ (ముడి రాతి భాస్వరం) దేశీయంగా ఉత్పత్తి చేయాలని కేంద్ర ఎరువుల శాఖ తాజాగా నిర్ణయించింది. పలు రాష్ట్రాల్లో తవ్వకాలకు చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప, మధ్యప్రదేశ్‌లోని హీరాపూర్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌, ఉత్తరాఖండ్‌లోని ముస్సోరితో పాటు రాజస్థాన్‌లోని భూగర్భంలో రాక్‌ ఫాస్ఫేట్‌ నిల్వలు 30 లక్షల టన్నులున్నట్లు కేంద్ర గనుల శాఖ పేర్కొంది.

రైతులు పంటల సాగులో అధికంగా వాడే ‘డ్రై అమ్మోనియం ఫాస్ఫేట్‌’(డీఏపీ), కాంప్లెక్స్‌(మిశ్రమ) ఎరువు తయారీలో దీనిని ముడిసరకుగా వాడతారు. ఇంతకాలం రాక్‌ ఫాస్ఫేట్‌ మనదేశంలో లేనందున విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. గత ఆరునెలల్లో దీని ధరలను విదేశీ కంపెనీలు అమాంతం పెంచేశాయి. దీనివల్ల మనదేశంలో రైతులు కొనే 50 కిలోల డీఏపీ బస్తా గరిష్ఠ చిల్లర ధర(ఎమ్మార్పీ)ని రూ.1200 నుంచి రూ.1900కి పెంచాలని గత మే నెలలో కంపెనీలు నిర్ణయించాయి.

రైతులపై ఒకేసారి అంత భారం వేయడం సరికాదని రాయితీ రూపంలో చెల్లిస్తామని కంపెనీలకు కేంద్రం తెలిపింది. ఈ నిర్ణయంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22)లో కేంద్ర బడ్జెట్‌లో తొలుత కేటాయించిన ఎరువుల రాయితీ పద్దును రూ.79 వేల కోట్ల నుంచి రూ.94 వేల కోట్లకు గత నెలలో పెంచాల్సి వచ్చింది. ఏటా ఇలా విదేశీ కంపెనీలు ఇష్టారీతిగా ధరలు పెంచుతున్నందున దిగుమతులపై రాయితీల భారం అధికమవుతోందని మనదేశంలోనే డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల తయారీ పెంపుపై తాజాగా దృష్టి పెట్టింది.

గనుల తవ్వకాలపై చర్చలు

దేశవ్యాప్తంగా భూగర్భంలో రాక్‌ఫాస్ఫేట్‌ నిల్వలు ఎక్కడున్నాయి, దానిని బయటకు తీయడానికి గల అవకాశాలపై కేంద్ర గనులు, భూ భౌతిక సర్వే ఆఫ్‌ ఇండియా శాఖలతో ఎరువుల శాఖ చర్చిస్తోంది. ఇందులో భాగంగానే కడపతో పాటు మిగతా ప్రాంతాల్లో తవ్వకాలు జరపవచ్చని తేలింది. అన్ని శాఖలు కలసి సంయుక్తంగా వీలైనంత త్వరగా ఈ తవ్వకాలకు గనులు ప్రారంభించాలని యోచిస్తున్నారు.

ఇదీ చదవండి: Haritha haram: ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా.. నేటి నుంచి ఏడో విడత హరితహారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.