ETV Bharat / state

CEC Team Meeting with Telangana Officials : అధికారుల లెక్కలు.. వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదు.. సీఈసీ అసంతృప్తి! - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

CEC Team Meeting with Telangana Officials : శాసనసభ ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో.. ఈసీ బృందం సమావేశం నిర్వహించింది. పలు అంశాలపై ఆరా తీసిన ఈసీ బృందం.. ప్రలోభాల పర్వంపై ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలిసింది. అక్రమ నగదు, మద్యం, మత్తు పదార్థాల స్వాధీనానికి సంబంధించి చాలా తక్కువ చూపుతున్నారని.. వారు వ్యాఖ్యానించినట్లు సమాచారం.

eci
Central Election Commission
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2023, 9:49 PM IST

CEC Team Meeting with Telangana Officials in Hyderabad : అక్రమ డబ్బు, మద్యంతో పాటు మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకునే విషయమై.. కేంద్ర ఎన్నికల సంఘం ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. శాసనసభ ఎన్నికల సన్నద్ధత సమీక్షించిన ఈసీ బృందం.. చివరి రోజైన ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీకుమార్, సీనియర్ అధికారులతో సమావేశమైంది. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు, ప్రణాళికలను సీఎస్, డీజీపీ ఎన్నికల సంఘానికి వివరించారు.

పలు అంశాలను ఆరా తీసిన ఈసీ బృందం (CEC Team) .. ప్రలోభాల పర్వంపై ఎక్కువగా దృష్టి సారించినట్లు సమాచారం. డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాల స్వాధీనానికి సంబంధించి చాలా తక్కువ చూపుతున్నారని.. ఈసీ బృందం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాలకు సంబంధించి అధికారులు ఇస్తున్న లెక్కలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని అన్నట్లు సమాచారం. ప్రలోభాల సూత్రధారులను ఎందుకు గుర్తించలేకపోతున్నారని.. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించినట్లు తెలిసింది.

TS Assembly Elections 2023 : 'ఈ దఫా ఎన్నికల్లో అన్నీ కొత్త ఈవీఎంలే'

మద్యం విషయంలో నివేదికలు వాస్తవాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయని ఈసీ బృందం (Central Election Commission) అన్నట్లు సమాచారం. మాదక ద్రవ్యాలకు సంబంధించి ప్రసార మాధ్యమాల్లో నిత్యం మీడియాలో కథనాలు చూస్తున్నామని.. స్వాధీనానికి సంబంధించిన నివేదికలు మాత్రం అందుకు తగ్గట్లుగా లేవని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఎన్​ఫోర్స్​మెంట్ విభాగాల నుంచి తగిన వివరాలు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Central Election Commission Team to Visit Telangana : కలెక్టర్లు, పోలీసు అధికారుల బదిలీలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై.. ఉన్నతాధికారుల నుంచి ఈసీ బృందం వివరణ తీసుకున్నట్లు సమాచారం. పక్కపక్క జిల్లాలకే ఎందుకు బదిలీలు చేస్తున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. పారదర్శకంగా, ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఎన్నికలు నిర్వహించాలన్నది తమ ఉద్దేశమని.. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి అధికారులందరూ తమ కింద డిప్యూటేషన్​గా పనిచేయాల్సి ఉంటుందని అన్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో అధికారులు మంచి ఫలితాలు చూపారని.. ఇక్కడ కూడా సమర్థంగా, పటిష్టంగా పనిచేసి అదే తరహాలో ఫలితాలు రాబట్టాలని అధికారులకు ఈసీ బృందం స్పష్టం చేసినట్లు తెలిసింది.

CEO Vikas Raj Review on Voter Enrolment in Hyderabad : 'ఓటు హక్కు నమోదు చేసుకునేలా.. ఓటర్లను చైతన్య పరచాలి'

CEC Rajiv Kumar on Telangana Assembly Elections 2023 : రానున్న శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు, ముఖ్యంగా యువత చైతన్యవంతంగా ఉంటూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పెద్దసంఖ్యలో ఓటుహక్కు వినియోగించుకోవాలని.. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajiv Kumar) విజ్ఞప్తి చేశారు. ఓటర్లను చైతన్య పరిచేందుకు, అవగాహన కోసం చేపట్టిన స్వీప్ కార్యకలాపాల్లో భాగంగా.. హైదరాబాద్​లోని టెక్ మహీంద్రా ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మిగిలిన ఇద్దరు కమిషనర్లతో కలిసి ఓటర్లతో మాటామంతీ కార్యక్రమంలో రాజీవ్ కుమార్ పాల్గొన్నారు.

Voter Awareness Telangana 2023 : అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు.. పోలింగ్ శాతం పెంచడంపై స్పెషల్ ఫోకస్

ఎన్నికలకు సంబంధించిన పలు సందేహాలను​ నివృత్తి చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్​లో ఓటు చాలా విలువైందని.. టాటాలు, బిర్లాలకైనా, సామాన్య పౌరులకైనా ఓటు ఒకటే ఉంటుందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వివరించారు. ఓటుహక్కు ప్రాముఖ్యత తెలుసుకొని మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని సూచించారు. సినినీటి ఎన్నికల ప్రచారకర్త అక్కినేని అమల ప్రేక్షకులతో ఇష్ఠాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించారు.

Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఓటర్లను చైతన్యం చేస్తున్న వివిధ రంగాల ప్రముఖులు, ట్రాన్స్ జెండర్ ప్రతినిధులు, దివ్యాంగులు, ఐటీ పరిశ్రమలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, జిల్లా ఎన్నికల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓటర్లను చైతన్యవంతులను చేసేందుకు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో గోండు, గుస్సాడీ, చెంచు తదితర సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని అలరించాయి.

Telangana Elections 2023 : అసెంబ్లీ ఎన్నికలకు వేళాయే.. కసరత్తు షురూ చేసిన సీఈసీ

Central Election Commission Telangana Tour : ప్రలోభాల అడ్డుకట్టతోనే పారదర్శకంగా ఎన్నికలు.. అధికారులకు ఈసీ కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.