ETV Bharat / state

మంత్రి కేటీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు - మధ్యాహ్నం 3 గంటలలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు - Central Election Commission notices Minister KTR

CEC Notices to Minister KTR : మంత్రి కేటీఆర్‌కు.. సీఈసీ నోటీసులు ఇచ్చింది. టీ వర్క్స్‌లో స్టూడెంట్ ట్రైబ్ భేటీలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిని పరిశీలించిన ఈసీ.. కేటీఆర్ ప్రాథమిక ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం 3 గంటల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

CEC notices to Minister KTR
CEC notices to Minister KTR
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2023, 8:46 AM IST

Updated : Nov 26, 2023, 10:09 AM IST

CEC Notices to Minister KTR : బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు (Minister KTR ).. కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. టీ వర్క్స్ కార్యాలయంలో స్టూడెంట్ ట్రైబ్ సమావేశం, అందులో చేసిన వ్యాఖ్యలపై.. కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సుర్జేవాలా ఫిర్యాదు ఆధారంగా కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై హామీ ఇస్తూ చేసిన వ్యాఖ్యలపై.. రణదీప్ సింగ్ సుర్జేవాలా సీఈసీకి ఫిర్యాదు చేశారు.

107 Candidates Disqualified From Elections : 107 మంది అభ్యర్థులపై ఈసీ అనర్హత వేటు.. ఆ నియోజకవర్గంలోనే అధికంగా

Election Commission of India Notices to KTR : రాజకీయ కార్యకలాపాల కోసం.. ప్రభుత్వ కార్యాలయం టీ వర్క్స్‌ను వాడుకున్నారని.. రణదీప్ సింగ్ సుర్జేవాలా (Randeep Singh Surjewala) ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఈవో, అధికారుల నివేదిక ఆధారంగా.. కేటీఆర్ ప్రాథమికంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. సిరిసిల్ల నుంచి ఎన్నికల్లో పోటీలో ఉండడంతో పాటు స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ఆయన.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. దీనిపై ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల్లోగా వివరణ ఇవ్వాలని కేటీఆర్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. గడువులోగా వివరణ ఇవ్వకపోతే తగిన చర్యలు, నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని నోటీసులో పేర్కొంది.

కేసీఆర్​కు నోటీసులు..: కేంద్ర ఎన్నికల సంఘం.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు (CM KCR) సైతం శనివారం రోజున నోటీసులు జారీ చేసింది. బాధ్యతాయుతమైన పదవితో పాటు పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని.. వాటిని తీవ్రంగా పరిగణిస్తామంటూ సీఈసీ సలహా (అడ్వయిజరీ) అందులో హెచ్చరించింది. ఈ లేఖను తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపించి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేయాలని సూచించింది.

10 ఏళ్ల బీఆర్​ఎస్​, 50 ఏళ్ల కాంగ్రెస్​ - ఎవరి పాలన బాగుందో చూసి ఓటేయండి : సీఎం కేసీఆర్​

ప్రజలను రెచ్చగొట్టేలా చేసే ప్రసంగాలను.. సీఈసీ (Election Commission of India) చాలా తీవ్రంగా పరిగణిస్తుందని లేఖలో స్పష్టం చేసింది. అలా మాట్లాడిన వ్యక్తుల పార్టీల అనుమతులు.. రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని తెలిపింది. ప్రస్తుతానికి సీరియస్‌గా తీసుకోవడం లేదని, ఆ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ పరిమితులు ఉన్నాయని కేంద్ర ఎన్నిక సంఘం వెల్లడించింది.

ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి ప్రసంగాలు ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అక్టోబర్‌ 30న ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లా బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సభలో.. దుబ్బాక అభ్యర్థిపై కత్తిపోట్ల ఘటనపై ప్రతిపక్ష పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని.. పరుషమైన పదాలను ఉపయోగించడమే కాకుండా.. రెచ్చగొట్టేలా మాట్లాడారని సీఈసీ లేఖలో పేర్కొంది.

సమయం లేదు మిత్రమా - అసెంబ్లీ పోలింగ్​కు ఈసీ చకచకా ఏర్పాట్లు

EC Issues Notice to Telangana Pragathi Bhavan : ప్రగతిభవన్ సాక్షిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. బీఆర్ఎస్​పై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు

Last Updated : Nov 26, 2023, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.