హైదరాబాద్ ఉప్పల్‌లోని సీడీఎఫ్‌డీ ఉన్నతాధికారిపై సహోద్యోగి కత్తితో దాడి చేశాడు. ఏవో వెంకటేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ శర్మ మధ్య గత కొంత కాలంగా వివాదం జరుగుతుంది. తనకు రావాల్సిన ప్రమోషన్ రాకుండా ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక ఇచ్చాడనే నెపంతో శర్మ ఏవోపై కక్ష పెంచుకున్నాడు. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో వెంటేశ్వర రావుతో శర్మ గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి... శర్మ కత్తితో దాడి చేశాడు. గాయపడ్డ వెంకటేశ్వరరావును ఉప్పల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి : అనుమానంతో భార్యను హతమార్చిన భర్త