ETV Bharat / state

RTC: ఉత్తమ సహకార సంఘానికి బీటలు.. క్రమంగా సభ్యత్వం రద్దు చేసుకుంటున్న వైనం! - తెలంగాణ వార్తలు

ఉత్తమ సహకార సంఘం బీటలు వారుతోంది. ఆర్టీసీ(RTC) యాజమాన్యం సీసీఎస్‌(CCS)కు చెల్లించాల్సిన బకాయిలు రూ.1,100ల కోట్లకు చేరింది. సీసీఎస్ కోలుకుంటుందన్న నమ్మకాన్ని ఉద్యోగులు వదులుకుంటున్నారు. ఒక్కో ఉద్యోగి సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటికే సుమారు 20వేల మంది పైచిలుకు సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే... భవిష్యత్‌లో సీసీఎస్ కొనసాగడం కష్టమేనని కార్మికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతో పాలకమండలి కోర్టును మరోసారి ఆశ్రయించాలని చూస్తోంది.

telangana rtc problems, members withdrawal from ccs
తెలంగాణ ఆర్టీసీ ఇబ్బందులు, సీసీఎస్ సభ్యుత్వం రద్దు చేసుకుంటున్న సభ్యులు
author img

By

Published : Aug 3, 2021, 1:16 PM IST

ఆర్టీసీ(RTC) సంస్థ అంటే ప్రజల్లో నమ్మకం ఉంది. అంతకు మించి విశ్వాసం ఉంది. అండగా ఉండాల్సిన యాజమాన్యమే కార్మికుల సొమ్ము వినియోగించుకుంది. ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వలేకపోయింది. సంస్థకు రూ.వేల కోట్లలో నష్టాలు రావడంతో కార్మికుల నుంచి తీసుకున్న మొత్తాన్ని ఇప్పట్లో చెల్లించే పరిస్థితులు కనిపించడం లేదు. ఫలితంగా కార్మికులకు సంస్థపై నమ్మకం పోతోంది.

సభ్యత్వాలు రద్దు

సీసీఎస్‌లో 46,000ల మంది సభ్యులు ఉన్నారు. కార్మికుల జీతాల నుంచి ప్రతినెలా 7.5శాతాన్ని సీసీఎస్‌(CCS)కు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ సొమ్మును యాజమాన్యం గత రెండేళ్లుగా చెల్లించడంలేదు. ఫలితంగా తీసుకున్న అసలు, వడ్డీ కలుపుకుంటే రూ.1,100ల కోట్ల బకాయిలను యాజమాన్యం సీసీఎస్‌కు చెల్లించాల్సి ఉంది. ఇప్పట్లో ఆ డబ్బును చెల్లించే ఆర్థిక పరిస్థితి సంస్థకు లేదు. ఫలితంగా ఒక్కో సభ్యుడు సీసీఎస్ సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు సుమారు 20వేల మంది సభ్యులు తమ సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నట్లు సీసీఎస్ పాలకమండలి సభ్యులు తెలిపారు.

రెండేళ్లు గడిచినా ఇబ్బందులే

కార్మికుల జీతం నుంచి మినహాయించిన 7.5శాతం సొమ్మును సీసీఎస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంది. తద్వారా వచ్చిన ఆదాయంతో ఉద్యోగులకు తక్కువ వడ్డీకీ హౌసింగ్ లోన్, పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం రుణాలు ఇవ్వడం ద్వారా సంఘానికి ఆదాయం సమకూరుతుంది. ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న సంస్థ నుంచి మాతృసంస్థ ఆర్టీసీ... సీసీఎస్ నుంచి రూ.1,100ల కోట్ల వరకు తమ అవసరాల కోసం వాడుకుంది. ప్రతి నెలా ఉద్యోగుల జీతాల నుంచి వచ్చే రూ.40 కోట్లను ఆర్టీసీ యాజమాన్యం చెల్లించడంలేదు. రెండేళ్లు గడిచినా సభ్యులకు చెల్లించాల్సిన నగదును చెల్లించే సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో ఏం చేయాలో తెలియక... గతంలోనే పాలకమండలి సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.

ఒక్కసారిగా 20వేల మందికి వరకు పైగా సభ్యత్వాన్ని రద్దు చేసుకోవడంతో... వారందరికి సెటిల్‌మెంట్ చేయాల్సిన బాధ్యత, భారం సీసీఎస్‌పై పడింది. గతంలో తక్కువ మంది సభ్యులు సభ్యత్వాన్ని రద్దు చేసుకోవడంతో ప్రతినెలా రూ.40 కోట్లు చెల్లించాల్సి వచ్చేది. అది చెల్లించకుండా యాజమాన్యం వాడుకునేది. సభ్యుడి నుంచి 7.5 శాతం రికవరీ అయ్యేది. తాజాగా పాలకమండలి దాన్ని ఒక్కశాతానికి తగ్గించాలని నిర్ణయించింది. దీంతో రూ.28 కోట్లు మాత్రమే సీసీఎస్‌కు చెల్లించాల్సి వస్తోంది. అంటే యాజమాన్యం ఇవ్వాల్సింది రూ.12 కోట్లు తగ్గిపోతుంది. ఇలా యాజమాన్యంపై ఒత్తిడి పెంచాలని పాలకవర్గ సభ్యులు నిర్ణయించారు. కనీసం ఇలాగైనా యాజమాన్యం స్పందిస్తుందో లేదో చూడాలి. గతంలో కోర్టుకు వెళ్లినప్పుడు మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. ఇప్పుడు పూర్తిస్థాయిలో ఉత్తర్వులు ఇచ్చి... యాజమాన్యం నుంచి రావాల్సిన తమ డబ్బులు తమకు ఇప్పించాలని వచ్చే వారం లోపు కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించాం.

-సీసీఎస్ పాలకమండలి

ఉత్తమ సహకార సంఘానికి బీటలు

ఇదీ చదవండి: MURDER: కోడలితో వివాహేతర సంబంధం.. కుమారుడిని చంపిన తండ్రి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.