దేశంలో సుమారు 5వేల వరకు కరోనా వైరస్ వేరియంట్లను గుర్తించినట్లు సీసీఎంబీ(సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) తాజాగా ప్రకటించింది. గతేడాది జనవరి 30న కేరళలో కరోనా వైరస్ తొలి కేసు వెలుగు చూసినప్పటి నుంచి వైరస్‌కి సంబంధించిన జన్యు క్రమాన్ని విశ్లేషిస్తున్న సీసీఎంబీ.. ఈ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను వణికిస్తున్న ఈ484కే, ఎన్440కే రకాలు మాత్రం దేశంలో అంత వేగంగా విస్తరించటం లేదని పేర్కొంది. ఈ విషయంలో స్పష్టత వచ్చేందుకు మరిన్ని పరిశోధనలు జరపాల్సి ఉంటుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా స్పష్టం చేశారు.
ఎన్440కే రకం వైరస్ మాత్రం దక్షిణ భారతదేశంలో వేగంగా వ్యాపిస్తున్నట్టు గుర్తించామని మిశ్రా వెల్లడించారు. ఇక భారత్‌లో గడచిన ఏడాది కాలంలో కరోనా వైరస్‌లో వచ్చిన మార్పులను విశ్లేషించిన సీసీఎంబీ.. ఏ3ఐ రకంలో వచ్చిన మ్యుటేషన్ వల్ల వైరస్ వ్యాప్తి వేగం తగ్గినట్టు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కరోనా నిబంధనలతో జిల్లా న్యాయస్థానాల్లో ఆంక్షల ఎత్తివేత