Obulapuram Mines Case Update: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చుట్టూ సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసు నుంచి తననుతొలగించాలన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేసి.. వాదనలు వినిపిస్తామని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. ఓఎంసీకి లీజుల కేటాయింపు సమయంలో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి.. అవినీతి నిరోధక చట్టం ప్రకారం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ అభియోగం. తనపై కేసు కొట్టివేయాలని కోరుతూ సబితా ఇంద్రారెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు.
Obulapuram Mining Case: మొదటి రెండు ఛార్జిషీట్లలో సాక్షిగా పేర్కొని.. మూడో అభియోగపత్రంలో సరైన కారణం లేకుండానే నిందితురాలిగా మార్చారని సబితా ఇంద్రారెడ్డి తరఫున న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదించారు. కొత్త ఆధారాలు, సాక్షులు లేకుండానే సాక్షి నుంచి నిందితురాలిగా ఎలా మార్చారో సీబీఐ వివరించలేదన్నారు. సీబీఐ కోర్టు కూడా తమ వాదనను పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇచ్చిందని వాదించారు. సబితా ఇంద్రారెడ్డి పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేస్తామని సీబీఐ తెలపడంతో విచారణను ఈ నెల 24కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది.
అసలు విషయం ఏంటంటే..: ఈ కేసులో తన పేరును తొలగించాలంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీబీఐ కోర్టులో వేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేయడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. గనుల కేటాయింపు ఫైల్‌ను ఆమోదించడం తప్ప.. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరగగా.. సరైన ఆధారాలు లేకుండానే సబితా ఇంద్రారెడ్డిని నిందితురాలిగా చేర్చారంటూ మంత్రి తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం కేసును శుక్రవారానికి వాయిదా వేసింది. నిన్న మరోసారి విచారణ జరగగా.. కౌంటర్ దాఖలు చేస్తామని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. దీంతో కేసు ఈ నెల 24కు వాయిదా పడింది.
ఇవీ చూడండి..
ఓబుళాపురం గనుల కేసు ఆ అంశాలతో తనకు సంబంధం లేదన్న సబితా ఇంద్రారెడ్డి
'అదానీ వ్యవహారంపై మోదీ మౌనం వీడరేం?'.. జార్జ్ వ్యాఖ్యలతో భారత్‌లో దుమారం