ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో భాగంగా... పెన్నా సిమెంట్స్‌కు గనుల లీజు కేటాయింపుల్లో మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి కీలక పాత్ర పోషించారంటూ సీబీఐ సోమవారం సీబీఐ కోర్టులో కౌంటరు దాఖలు చేసింది. తాండూరుకు చెందిన గనుల లీజు పునరుద్ధరణ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారంది. అభియోగాల నమోదు దశలో నిందితులను డిశ్ఛార్జి చేయరాదని తెలిపింది. పెన్నా కేసులో పెన్నా గ్రూపు అధినేత పెన్నా ప్రతాప్‌రెడ్డి డిశ్ఛార్జి పిటిషన్‌పై సోమవారం వాదనలు కొనసాగాయి. ఈ పిటిషన్‌లపై తదుపరి విచారణ ఈనెల 23కు వాయిదా పడింది.
ఏపీ సీఎం జగన్‌పై కేసుల ఉపసంహరణ.. సుమోటోగా తీసుకుని హైకోర్టు విచారణ
లేపాక్షికి ఏపీలోని అనంతపురంలో భూముల కేటాయింపు కేసులో డిశ్ఛార్జి పిటిషన్‌లు దాఖలు చేయడానికి వారి తరఫు న్యాయవాది గడువు కోరడంతో అనుమతించిన కోర్టు... ఈనెల 24కు వాయిదా వేసింది. ఈలోగా పిటిషన్‌లు దాఖలు చేయాలని లేని పక్షంలో వాదనలకు సిద్ధం కావాలని ఆదేశించింది. అభియోగాల నమోదు ప్రక్రియలో వాదనలు వినిపించాలని ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి తరఫు న్యాయవాదికి ఆదేశించింది. ఇందూ టెక్ జోన్‌లో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ డిశ్ఛార్జి పిటిషన్‌లో కౌంటరు దాఖలు చేయడానికి సీబీఐ గడువు కోరడంతో విచారణ ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది.
ఓంఎంసీ కేసు విచారణ
ఓబుళాపురం అక్రమ మైనింగ్‌కు సంబంధించిన కేసులో తనపై కేసును కొట్టివేయాలని కోరుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. నిబంధనల ప్రకారమే ఓఎంసీకి లీజు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇందులో తనపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. దీనిపై విచారణ మంగళవారం కొనసాగనుంది.
ఇదీ చూడండి: VIJAYASAI BAIL: 'విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుపై నిర్ణయం మీదే'