ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కేంద్ర, రాష్ట్ర పెద్దల అండతో భూకబ్జా బాగోతం నడుస్తోందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. తెరాస కార్పొరేటర్ భర్త మణికేశ్వర్‌నగర్‌లో ఓయూ సెంటర్ ఫర్ డివోషనల్ స్టడీస్ కి చెందిన 2వేల గజాల భూమి కబ్జాకు ప్రయత్నిస్తే.. భాజపా కేంద్ర బడా నేతల అండతో 8వేల గజాలకు పైగా కబ్జా బాగోతం నడుస్తోందని వంశీచంద్ రెడ్డి ఆరోపించారు.
ప్రహరీ గోడ నిర్మించాలి
కబ్జాదారులకు ప్రభుత్వ యంత్రాంగం అండగా నిలుస్తోందని మండిపడ్డారు. దీనిని అడ్డుకుంటున్న విద్యార్థులు, అధ్యాపకులపై పోలీసు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాలతో కబ్జాలను వ్యతిరేకిస్తున్న అధ్యాపకులపై కేసులు పెట్టడం దారుణమన్నారు. భూకబ్జాల బాగోతాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని.. న్యాయపరంగా అధికారికంగా చర్యలు తీసుకుని విశ్వవిద్యాలయానికి ప్రహరీ గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: వలస కూలీలను పంపేందుకు చర్యలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్