ETV Bharat / state

Viveka Murder Case : వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు.. ఆ నేత టార్గెట్​గా విచారణ - ఏపీ మంత్రి వివేకా హత్యకేసు

Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరితో మరోసారి కోర్టులో.. వాంగ్మూలం నమోదు చేయించనున్నారు.

Viveka Murder Case
VIVEKA Murder Case
author img

By

Published : Feb 18, 2022, 2:01 PM IST

Updated : Feb 18, 2022, 3:21 PM IST

Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ అధికారుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో మకాం వేసిన సీబీఐ డీఐజీ చౌరాసియా... వివేకా హత్య కేసుపై అధికారులతో ఆరా తీస్తున్నారు. హైకోర్టు తీర్పు దృష్ట్యా వాంగ్మూలం పత్రాలను... సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో సమర్పించనున్నారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరితో మరోసారి కోర్టులో.. వాంగ్మూలం నమోదు చేయించనున్నారు. కేసులో ఉన్న కీలక వ్యక్తులప్రమేయాన్ని పూర్తిగా నిర్ధరణచేసి..తదుపరిచర్యలు చేపట్టే అవకాశాన్నిసీబీఐ పరిశీలిస్తుంది.కోర్టుకుసమర్పించిన వివరాల ప్రకారంకడప ఎంపీ పాత్రను తేల్చే దిశగావిచారణ సాగుతోంది

కడప సబ్ కోర్టు అనుమతి..
Viveka Murder Case : మాజీమంత్రి వివేకా హత్య కేసులో.. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారడానికి కడప సబ్ కోర్టు అనుమతి ఇచ్చింది. దస్తగిరి అప్రూవర్‌గా మారుతున్నాడని.. 306 సెక్షన్ కింద సాక్ష్యం నమోదు చేయాలని కడప సబ్ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. దస్తగిరిని అప్రూవర్​గా మారేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు మరోసారి దస్తగిరి నుంచి 164 సెక్షన్ కింద మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం నమోదు చేయించనున్నారు.

ఇదీ చూడండి : CBI Inquiry on Viveka Murder Case : వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు .. కడపకు చౌరాసియా

Last Updated : Feb 18, 2022, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.