వాహన విక్రయాలు పడిపోవటానికి ప్రజల్లో నెలకొన్ని సందిగ్ధతే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కర్బన ఉద్గారాలకు సంబంధించి బీఎస్-4, బీఎస్-6 నిబంధనల విషయంలో ప్రజలు ఆలోచించి కొనుగోళ్లు చేస్తున్నారని తెలిపారు.
మార్చి 2020 వరకు బీఎస్-4 వాహనాలను రిజస్ట్రేషన్ చేసుకోవచ్చని ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేసినప్పటికీ... ప్రజలు వేచిచూసే ధోరణిలో ఉన్నారని తెలిపారు. ఆర్థిక మందగమనం కూడా ప్రభావం చూపెడుతున్నదని వారు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్లో కూడా మార్కెట్ మందగమనంలో కొనసాగుతుందని వారు అంటున్నారు. సంవత్సరం చివరలో విక్రయాలు బాగుంటాయని, ఆ సమయంలో కొన్ని కంపెనీలు భారీ స్థాయిలో ఆఫర్లను ప్రకటిస్తాయన్నారు. దానివల్ల వచ్చే నెలలో అమ్మకాలు ఊపందుకుంటాయని వారు ఆశిస్తున్నారు. మొత్తం మీద మార్చి వరకు ఈ కొనుగోల్లు నెమ్మదించటం కొనుసాగుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: 'మహా' ప్రతిష్టంభన: సేనకు చిక్కని పీఠం-ఎన్సీపీకి ఆహ్వానం!