తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తి నివారణలో ముందు జాగ్రత్త చర్యగా మార్చి 20 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు కేసుల విచారణ వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య ఆదేశాలు జారీ చేశారు.
మార్చి 20 వరకు విచారణ చేసిన ఫిర్యాదులన్నీ జూన్ 19వ తేదీ నాటికి వాయిదా వేశారు. అత్యవసర ఫిర్యాదులు మంగళ, గురువారాల్లో రెండుసార్లు విచారణ జరుగుతుందన్నారు. వైరస్ నియంత్రణ కోసం.. ఉద్యోగులు.. ఎవరినీ లోపలికి అనుమతించకుండా గేటుకు తాళం వేసి విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇదీ చూడండి: కరోనా వైరస్‌పై పోరుకు భారత్ సరికొత్త వ్యూహం