ETV Bharat / state

హైటెక్​సిటీలో 2 కోట్లు స్వాధీనం.. ఎంపీపై కేసు నమోదు - case-on-MP muralimohan

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్ముర తనిఖీలను చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ మొత్తంలో నగదు పట్టుబడుతోంది. రాత్రి హైటెక్ సిటీలో రూ.2 కోట్ల నగదు పట్టుకున్నారు. ఈ డబ్బును ప్రముఖ సినీ నటుడు, ఎంపీ మాగంటి మురళీ మోహన్​కు ఇచ్చేందుకు తీసుకెళ్తునట్లు పోలీసులు వెల్లడించారు.

భారీ మొత్తంలో నగదు
author img

By

Published : Apr 4, 2019, 3:02 PM IST

హైదరాబాద్​లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్​లో బుధవారం రాత్రి టాస్క్‌ఫోర్స్‌ దాడిలో రూ.2 కోట్ల నగదు పట్టుబడింది. తనిఖీల్లో భాగంగా నిమ్మలూరి శ్రీహరి, అవూరి పాండరిపై అనుమానం వచ్చి సోదాలు చేశారు. వీరి వద్ద రెండు బ్యాగుల్లో ఉన్న రూ. 2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. పట్టబడ్డ డబ్బు జయభేరి సంస్థకు చెందినదిగా గుర్తించారు. రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్​కు ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ఎంపీ మురళీ మోహన్​పై కూడా కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:ఎన్నికల వాయిదాకై కోర్టుకెక్కిన ఇందూరు రైతులు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.