ఇదీ చదవండి:జూబ్లీహిల్స్‌లో రూ. కోటి 49 లక్షలు స్వాధీనం
జనసేనాని పవన్‌కల్యాణ్‌పై జూబ్లీహిల్స్‌లో కేసు - jublihills
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్టేషన్లో కేసు నమోదైంది. ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే విధంగా పవన్ ప్రచారం చేస్తున్నారంటూ తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నేత కొంతం గోవర్దన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.
పవన్ కల్యాణ్‌పై జూబ్లీహిల్స్‌లో కేసు
ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 22న భీమవరంలో జరిగిన సభలో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్టేషన్లో కేసు నమోదైంది. ప్రచార సభలో పవన్‌కల్యాణ్ చేసిన ఆరోపణలో వాస్తవం లేదని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నేత కొంతం గోవర్దన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయ సలహా తీసుకున్న అనంతరం ఈ కేసులో చర్యలు తీసుకుంటామని జూబ్లీహిల్స్ సీఐ బాలకృష్ణ తెలిపారు.
ఇదీ చదవండి:జూబ్లీహిల్స్‌లో రూ. కోటి 49 లక్షలు స్వాధీనం
Last Updated : Mar 25, 2019, 12:23 AM IST