unique wood treadmill: ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండానే చకచకా ముందుకు సాగే ఈ ట్రెడ్‌మిల్ యంత్రాన్ని తయారు చేశాడు ఓ వడ్రంగి. తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన కడిపు శ్రీనివాస్.. కేవలం కలపతోనే తయారు చేసిన ఈ ట్రెడ్‌మిల్..అందరి మన్ననలే కాదు.. మంత్రి కేటీఆర్ దృష్టినీ ఆకర్షించింది.
unique wood treadmill: కడిపు శ్రీనివాస్ వడ్రంగి పనిచేస్తారు. అపార్ట్‌మెంట్లు, నూతన గృహాలకు కావాల్సిన వస్తువులను తయారుచేస్తుంటారు. వడ్రంగి పనిలో ఏదైనా వినూత్నంగా చేయాలని ఆలోచించేవారు. అలా... ఓ రోజూ ఓ ఇంటి వద్ద పనిచేస్తు ఉండగా..అక్కడ ఒకరు ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తుండటాన్ని గమనించారు. అప్పుడే దీన్ని కలపతో తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. రోజువారి పనులు చేసుకుంటూనే..రాత్రి వేళ, ఖాళీ సమయాల్లో కలపతో ట్రెడ్‌మిల్‌ను తయారు చేయడం మెుదలు పెట్టారు.
unique wood treadmill: విద్యుత్ అవసరం లేకుండా.. కలపతో ట్రెడ్ మిల్‌ను తయారు చేయడానికి చాలా రోజుల సమయం పట్టింది. అచ్చం విద్యుత్‌తో ఎలా అయితే పనిచేస్తోందో అలానే... దీన్ని తయారు చేశారు. ఈ ట్రెడ్ మిల్‌కు ..టేకు చెక్కలకు బాల్ బేరింగ్‌లను బిగించి.. రూపొందించారు. ఇది సాధారణ ట్రెడ్ మిల్ ఎలా పనిచేస్తుందో..అలానే పని చేస్తుంది. దీన్ని తయారు చేసేందుకు 10 వేల రూపాయలు ఖర్చు అయ్యిందని శ్రీనివాస్ చెప్పారు.
KTR on unique wood treadmill: తెలంగాణ మంత్రి కేటీఆర్...ట్రెడ్ మిల్ రూపొందించిన శ్రీనివాస్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. తన తండ్రిలోని ప్రతిభను చూసి అందరు మెచ్చుకుంటున్నారని..తమకు అలాంటి ట్రెడ్ మిల్ కావాలని ఆర్డర్లు వస్తున్నాయని శ్రీనివాస్ కుమారుడు మురళీ తెలిపారు. వినూత్నంగా ఆలోచిస్తే..ఏదైనా సాధించవచ్చని నిరూపించారు... మండపేటకు చెందిన వడ్రంగి కళాకారుడు శ్రీనివాస్.
ఇదీ చదవండి: "కొన్నప్పుడు 2250... అమ్మినప్పుడు 60.." ధరలేక టమాటా రైతుల ఆవేదన