ETV Bharat / state

ఆ రాష్ట్రాలకు కార్గో, పార్శిల్ సేవలు నిలిపివేత: టీఎస్ఆర్టీసీ

కరోనా ప్రభావం ఆర్టీసీ ఆదాయంపై పడింది. కొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూ విధించడం వల్ల ఆయా రాష్ట్రాలకు కార్గో, పార్శిల్ సేవలను తెలంగాణ రాష్ట్రం నిలిపివేసింది. తద్వారా ఆర్టీసీ ఆదాయం ఘననీయంగా తగ్గిపోయింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్​కు నడిచే బస్సులను నిలిపివేసిన తెలంగాణ రాష్ట్రం.. తాజాగా కార్గో, పార్శిల్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఆర్టీసీ రోజుకి రూ.3లక్షలకు పైగా ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది.

cargo, parcel services, tsrtc, rtc, telangana news

author img

By

Published : May 14, 2021, 2:57 PM IST

పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు కార్గో, పార్శిల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. రెండో దశ ఉద్ధృతిలో ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అక్కడి ప్రభుత్వం కర్ఫ్యూను విధించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పార్శిల్ సేవలను కొనసాగించడం కష్టమని ఏపీ ఏజెంట్లు స్పష్టం చేశారు. పరిస్థితులు చక్కదిద్దుకునే వరకు ఏపీకి పార్శిల్ సేవలు నిలిపివేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక అధికారి కృష్ణకాంత్ తెలిపారు.

సాధ్యపడడంలేదని...

టీఎస్ఆర్టీసీ ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వీటి నుంచి బయటపడేందుకు కార్గో, పార్శిల్ సేవలను ప్రారంభించింది. అధికారుల లెక్కల ప్రకారం.. ప్రతి రోజు 14,000 పార్శిళ్లను ఆంధ్రప్రదేశ్​లోని వివిధ ప్రాంతాలకు పంపుతున్నారు. వీటితో పాటు వివిధ కౌంటర్ల నుంచి రవాణా చేస్తారు. ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి కూడా ఏపీకి కార్గో, పార్శిల్ రవాణా చేసేవారు. కరోనా నేపథ్యంలో ఏపీలో ఉన్న ఏజెంట్లు పార్శిల్ సేవలు సాధ్యపడడంలేదని వెల్లడించడం వల్ల టీఎస్ఆర్టీసీ ఏపీకీ కార్గో, పార్శిల్ సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది.

మూడు రాష్ట్రాల్లో..

ఏపీలో అన్ని జిల్లాలకు పార్శిల్ ఏజెంట్లు ఉన్నారు. వీరితో పాటు సబ్ ఏజెంట్లూ ఉన్నారు. అందరూ కలుపుకుని సుమారు 25 మంది వరకు ఏజెంట్లు ఏపీలో పనిచేస్తున్నారు. ఏపీతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలకు టీఎస్ఆర్టీసీ పార్శిల్ సేవలను అందిస్తోంది. ఈ మూడు రాష్ట్రాల్లో ప్రస్తుతం సేవలను కొనసాగించలేమని టీఎస్ఆర్టీసీ తెలిపింది.

లక్షల పార్శిళ్లు పంపిణీ:

టీఎస్ఆర్టీసీలో 184 కార్గో బస్సులు ఉన్నాయి. వీటిలో 10టన్నుల సామర్థ్యం కలిగిన బస్సులు 150, నాలుగు టన్నుల సామర్థ్యం కలిగిన బస్సులు 34 ఉన్నాయి. వీటిని సరుకు రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. 2020 జూన్‌లో పార్శిల్ సర్వీసులను ప్రారంభించింది. ఇప్పటి వరకు 31 లక్షల పార్శిళ్లను పంపిణీ చేసి రూ.30 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కార్గో బస్సుల ద్వారా రూ.11 కోట్ల లాభం లభించింది.

మరింత నష్టం:

ఆర్టీసీ నిర్వహిస్తున్న కార్గో, పార్శిల్ సర్వీసులతో ఆదాయం సమకూరుతున్న సమయంలో ప్రస్తుతం కరోనా రెండో దశ ప్రభావం చూపే అవకాశముందని ఆర్టీసీ యాజమాన్యం అంచనావేస్తోంది. ఇప్పటికే ఏపీకి నడిపే ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. అవే నష్టాల్ని తీసుకొస్తున్నాయంటే.. ఇప్పుడు తాజాగా కార్గో బస్సులనూ రద్దు చేయడం వల్ల ఆర్టీసీకి మరింత నష్టం వాటిల్లే ప్రమాదముందని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.

ఇదీ చూడండి: రాష్ట్ర సరిహద్దులో ఏపీ అంబులెన్స్​ల నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.