హైదరాబాద్ గోపాలపురం పీఎస్ పరిధిలోని మామాజీ దాబా వద్ద ఉన్న ఫ్లైఓవర్ గోడ పైకి కారు దూసుకెళ్లింది. కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడం వల్ల అందులో ఉన్న వ్యక్తికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. కారు వేగంగా రావడం వల్లే ప్రమాదం జరిగిందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
కారు మెట్టుగూడ నుంచి బేగంపేట వైపు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా కాసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: జిల్లాల్లోనూ వేగంగా విస్తరిస్తున్న కరోనా