ETV Bharat / state

'అమరావతి కోసం వైకాపా, తెదేపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి'

ఏపీ రాజధాని విషయంలో వైకాపా ప్రభుత్వ తీరును జనసేనాని పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే రాజధాని క్రీడ మొదలుపెట్టారని ఆరోపించారు. అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రత్యక్ష పోరాటంలోకి రావాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Aug 2, 2020, 9:49 PM IST

pawan comments on amaravathi
'అమరావతి కోసం వైకాపా, తెదేపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి'

ఆంధ్రప్రదేశ్​ రాజధాని వికేంద్రీకరణ పేరిట 3 ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే రాజధాని క్రీడ మొదలుపెట్టారని దుయ్యబట్టారు. రాజధాని బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపటం వల్ల ఏర్పడిన పరిస్థితులు, తదుపరి కార్యాచరణపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించింది. ఈ సమావేశంలో మాట్లాడిన పవన్‌ కల్యాణ్.. రాజధాని విషయంలో వైకాపా ప్రభుత్వం తీరును తప్పుబట్టారు.

రాజధాని వికేంద్రీకరణ పేరిట 3 ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారు. అమరావతి రైతుల కోసం తెదేపా ఎమ్మెల్యేలు... కృష్ణా, గుంటూరు జిల్లాల వైకాపా ఎమ్మెల్యేలూ రాజీనామా చేయాలి. అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే ప్రత్యక్ష పోరాటంలోకి రావాలి. రైతు కన్నీరుపై రాజధాని నిర్మాణం వద్దని మొదట్నుంచీ చెబుతున్నాం. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే రాజధాని క్రీడ మొదలుపెట్టారు. రాజధాని వికేంద్రీకరణపై న్యాయకోవిదులు, నిపుణులతో చర్చిస్తాం.

- పవన్‌ కల్యాణ్, జనసేన అధినేత

న్యాయపోరాటానికి సమయం వచ్చింది

ఏపీ రాజధాని వికేంద్రీకరణకు పూర్తిస్థాయి ప్రజామోదం కనిపించట్లేదని జనసేన పార్టీ అభిప్రాయపడింది. రాజధాని వికేంద్రీకరణపై న్యాయపోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని జనసేన పేర్కొంది. ప్రజలు ఉద్యమించకుండా కొవిడ్‌ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పింది. వేల ఎకరాలను అమరావతి రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని, ప్రభుత్వం మారగానే రాజధాని మారితే ప్రభుత్వం మీద ప్రజలకు భరోసా పోతుందని జనసేన ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్‌, నాగబాబు, తోట చంద్రశేఖర్‌, పీఎసీ సభ్యులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.