క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన సూపర్ కార్ ర్యాలీకి విశేష స్పందన వచ్చింది. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ నుంచి ర్యాలీ చేపట్టగా.... నటీ మాళవిక శర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో 20కి పైగా సూపర్ కార్‌ల యజమానులు పాల్గొన్నారు.
అపోలో ఆస్పత్రి వరకు సాగిన ర్యాలీకి నటి క్యాథరిన్ త్రెసా అపోలో వద్ద స్వాగతం పలికారు. సరైన ఆహారం, వ్యాయామం తీసుకోవటంతోపాటు.... ధూమపానానికి దూరంగా ఉండటం వల్ల క్యాన్సర్ నివారించవచ్చని అపోలో క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: నీ నవ్వుతో మాయ చేయకు..'బేబమ్మ'!