కొవిడ్ విజృంభణ నేపథ్యంలో మినీ పురపోరులో ప్రచార సమయాన్ని కుదించారు. వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. అందుకు అనుగుణంగా పురపోరు ప్రచార సమయాల్లోనూ మార్పులు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది.
బహిరంగసభలు, ర్యాలీల్లో లౌడ్ స్పీకర్ల వినియోగం ఇప్పటి వరకు రాత్రి పదిగంటల వరకు ఉండగా ఆ సమయాన్ని రాత్రి ఎనిమిది గంటల వరకు కుదించారు. ఉదయం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకే అనుమతిచ్చారు. ఇతర సందర్భాల్లో లౌడ్ స్పీకర్లను ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకే వినియోగించాల్సి ఉంటుంది.
బహిరంగసభలు, ర్యాలీలు, ప్రచారానికి కొవిడ్ నిబంధనలు, రాష్ట్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వులకు లోబడి అనుమతి ఇవ్వాలని అధికారులకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ