ETV Bharat / state

321.98 కోట్ల ఆదాయానికి గండి: కాగ్​ - రాష్ట్ర రాబడి వార్తలు

రాష్ట్రంలో రెవెన్యూ బకాయిల వసూళ్లను పెంచాల్సి ఉందని భారత కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) అభిప్రాయపడింది. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే శాఖలకు చెందిన కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నట్లు కాగ్‌ పరిశీలనలో వెల్లడైంది. మరొకవైపు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ చెల్లింపుల్లో అధికారుల తప్పిదాలను ఎత్తిచూపటంతోపాటు.. ఏయే శాఖల్లో ఎంత మొత్తం ప్రభుత్వం కోల్పోవల్సి వచ్చిందో బహిర్గతం చేసింది. ఆరు ప్రభుత్వ శాఖలకు చెందిన రికార్డులను పరిశీలించినప్పుడు 321.98 కోట్లు విలువైన 33 తప్పులను ఎత్తిచూపింది.

cag report
కాగ్​ నివేదిక
author img

By

Published : Mar 26, 2021, 1:49 PM IST

భారత కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ 2019-20 ఆర్థిక ఏడాదికి సంబంధించి.. రాష్ట్ర రెవెన్యూ విభాగంపై అధ్యయనం చేసింది. తెలంగాణలో అమలవుతున్న పన్నుల విధానం, వివిధ శాఖల నుంచి ప్రభుత్వానికి వస్తున్న రాబడులు, పన్నులు, పేరుకుపోయిన బకాయిలు, జీఎస్టీ, వ్యాట్‌ అమల తీరు, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ చెల్లింపులు తదితర అంశాలను పరిశీలించింది. ఇందులో నియనిబంధనల ఉల్లంఘన, అధికారుల తప్పిదాలను ఎత్తి చూపింది. విలువ ఆధారిత పన్ను, కేంద్ర అమ్మకపు పన్ను, వస్తు సేవల పన్నులకు చెందిన ఎనిమిది కార్యాలయాల్లో 11 మంది డీలర్లకు చెందిన రికార్డులను కాగ్​ పరిశీలించింది. వ్యాపారేతర అవసరాలకు, భవన నిర్వహణ కోసం కొనుగోలు చేసిన వస్తువులపై హోటళ్లు, రెస్టారెంట్లు తప్పుడు లెక్కలు చూపి రూ.1.27 కోట్లు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పొందినట్లు నిగ్గు తేల్చింది.

41.32 కోట్లు మేర ప్రభుత్వ రాబడికి గండి

15 కార్యాలయాల్లో.. 29 మంది డీలర్లకు చెందిన వస్తువుల అమ్మకం, రెస్టారెంట్‌, క్యాంటిన్‌, బేకరీల వ్యాపారం చేసిన వ్యాపారులకు 14.5 శాతానికి బదులు తక్కువ పన్ను విధించడం ద్వారా రూ.32.78 కోట్లు రాబడికి గండికొట్టినట్లు కాగ్‌ గుర్తించింది. 12 కార్యాలయాల్లో 18 మంది డీలర్లకు చెందిన మొబైల్‌ ఫోన్ల అమ్మకంపై 14.5 శాతానికి బదులు తక్కువ పన్ను విధించడం ద్వారా రూ.43.89 కోట్ల ఆదాయానికి గండిపడినట్లు పేర్కొంది. ఎనిమిది కార్యాలయాల్లో 16 కేసుల్లో సరియైన పత్రాలు జతచేయని లావాదేవీలపై పన్ను మదింపు అధికారులు మినహాయింపు అనుమతించడం ద్వారా 41.32 కోట్లు మేర ప్రభుత్వ రాబడి కోల్పోయినట్లు వెల్లడించింది.

తక్కువ పన్ను విధింపు

43 కార్యాలయాల్లో.... 95 కేసుల్లో వ్యాట్‌ మదింపు, టర్నోవర్‌ వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించిన కాగ్‌ తద్వారా రూ.73.56 కోట్లు ఆదాయానికి గండిపడినట్లు తేల్చింది. 14 కార్యాలయాల్లో 19 కేసుల్లో డీలర్లు తప్పిదాలపై మదింపు అధికారులు తనిఖీలు నిర్వహించిన.. ఆరు కేసుల్లో జరిమానాలు విధించకపోవడం, మరో 13 కేసుల్లో జరిమానా తక్కువగా విధించడం ద్వారా ప్రభుత్వానికి రూ. 30.72 కోట్ల ఆదాయం కోల్పోయింది. ఆబ్కారీ శాఖకు చెందిన ఓ కార్యాలయంలో హైదరారబాద్‌ మహనగర పాలక సంస్థ పరిధిలో ఉన్న దుకాణాలు, బార్లకు రూ.2.70 కోట్లు మేర అబ్కారీ సుంకాన్ని తక్కువగా విధించినట్లు కాగ్‌ గుర్తించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖకు సంబంధించి కంపెనీలు తమ ఆస్తులను పారిపాసు విధానంలో తనఖా పెట్టి వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందాయని, దీనిపై 0.5శాతం రిజిస్ట్రేషన్‌ రుసుం వసూలు చేయాల్సి ఉండగా పదివేలు లెక్కన వసూలు చేశారని.. తద్వారా ప్రభుత్వానికి రూ.4.85 కోట్ల మేర ఆదాయానికి గండిపడినట్లు నిగ్గు తేల్చింది.

అధికారుల తప్పిదాలు

14 కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ లావాదేవీలను తప్పుగా వర్గీకరిచడం ద్వారా రూ.1.67 కోట్లు, వ్యవసాయేతర భూమిని వ్యవసాయ భూమిగా చూపడం ద్వారా ప్రభుత్వానికి 1.27 కోట్ల లెక్కన ఆదాయం కోల్పోయినట్లు తెలిపింది. ఇక మోటారు వాహనాల పన్నులకు చెందిన 33 కార్యాలయాల్లో డిమాండ్లు లేవనెత్తకపోవటంతో 7,393 మంది రవాణా వాహన యాజమానుల నుంచి రూ.8.31 కోట్లు వసూలు చేయలేకపోయారని.. మరో రూ.4.15 కోట్లు జరిమానా విధించలేదని కాగ్‌ ఎత్తి చూపింది. అదే విధంగా 34 కార్యాలయాల్లో 1,52,280 రవాణా వాహనాల యోగ్యతా ధ్రువ పత్రాలను పునరుద్ధిరించకపోవటంతో రూ.9.30 కోట్లు మేర నష్టపోయినట్లు వివరించింది. మరో 13 కార్యాలయాల్లో 69,473 వాహనాల నమోదు ధ్రువ పత్రాల చెల్లుబాటు గడువు ముగిసినప్పటికీ పునరుద్ధరించకపోవటం వల్ల రూ.3.28 కోట్లు రుసుం వసూలు కాలేదని ఎత్తిచూపింది. ఇంకో 20 కార్యాలయాల్లో 1,659 కేసుల్లో రవాణా చట్టాల కింద నమోదైన నేరాలకు అపరాధ రుసుం వసూలు చేయకపోవటంతో రూ.1.52 కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్లు కాగ్‌ పరిశీలనలో తేలింది.

ఇదీ చదవండి: ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్యులను తొలగించాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.