ETV Bharat / state

'ఇళ్ల పట్టాల కేటాయింపులో పేదలందరికి న్యాయం చేస్తాం' - తెలంగాణ తాజా వార్తలు

Cabinet sub -committee meeting on Housesites: ఇల్లు, ఇండ్ల స్థలాల పంపిణీ అంశంపై ఈరోజు మంత్రివర్గ ఉప సంఘం బీఆర్​కే భవనంలో సమావేశమైంది. అర్హులైన పేదలందరికీ ఇళ్లు లేదా ఇండ్ల స్థలాలు ఇవ్వాలనే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.

మంత్రివర్గ ఉప సంఘం
మంత్రివర్గ ఉప సంఘం
author img

By

Published : Feb 27, 2023, 7:55 PM IST

Cabinet sub -committee meeting on Housesites: రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇల్లు లేదా ఇండ్ల స్థలాలు ఇవ్వాలనే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పథకంతో కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండ్ల స్థలాల పంపిణీకి సంబంధించిన అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ బీఆర్కే భవన్​లో సమావేశమైంది. కేటీఆర్​తో పాటు మంత్రులు హరీశ్​రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబిత ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ ఈ భేటీలో పాల్గొన్నారు.

ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ, జీవో58, జీవో59 ఉత్తర్వుల కింద ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ, సాదాబైనామాలు, నోటరీ డాక్యుమెంట్లు, దేవాదాయ, వక్ఫ్ భూముల్లోని స్థలాల అంశంపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇల్లు లేదా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

2014లో లక్షా 25వేల మంది లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. 58వ ఉత్తర్వు కింద 20,685 ఇండ్ల పరిశీలన ప్రక్రియ పూర్తయిందని, పట్టాల పంపిణీ వేగవంతం చేయాలని ఆదేశించారు. వివిధ ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పరుచుకున్న దారిద్య రేఖ దిగువన ఉన్న వారికి ఇంటి పట్టాలు ఇవ్వాలన్న ఆయన కేటాయింపు విషయంలో పేదలే మొదట అన్న విధానంతో అధికారులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.

నోటరీ డాక్యుమెంట్లకు సంబంధించిన అంశాలపై చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం... నిర్ధిష్ట కార్యాచరణతో విధానాన్ని ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. అర్హత ఉన్న అన్ని కేసుల విషయంలో పేదలకు అనుకూలంగా ఉండేలా వ్యవహరించాలని, వేగంగా ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి వరకు జరిగిన శాసన సభ సమావేశాల్లో 2023-24 వార్షిక సంవత్సర బడ్జెట్​లో సొంత జాగాలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.7,350 కోట్లు కేటాయించింది. కుటుంబానికి మూడు లక్షల రూపాయాల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపింది. అలాగే వచ్చే ఏడాదికి డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకం కింద గృహాల నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయనున్నట్లు ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.