ఆనాటి విద్యుత్ ఉద్యమం ప్రపంచంలోని సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో తలమానికంగా నిలిచిపోయిందని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు తెలిపారు. బషీర్ బాగ్ కాల్పుల ఘటనకు నేటితో ఇరవై ఏళ్లు పూర్తయ్యింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వామపక్షాలు చేపట్టిన ధర్నాపై పోలీసులు కాల్పులు జరిపారు.
ఆ కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా... పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. అన్ని రంగాల ప్రజలను ఈ ఉద్యమం ఉత్తేజపరిచిందని రాఘవులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ అవే సంస్కరణలు అమలు పరిచేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బషీర్బాగ్ ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు.