హైదరాబాద్ మహానగరం తొలిసారిగా బ్యూరోక్రాట్ల వారసత్వ నడకకు వేదికైంది. ఆదివారం తెల్లవారుజామున ఉన్నతాధికారులు అశ్వంపై పాతబస్తీలో పర్యటించారు. విభిన్న రీతిలో జరిగిన ఈ యాత్రలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు గోషామహల్ అశ్వశాల నుంచి ప్రారంభమై సుమారు 20 గుర్రాలతో మూసీ నది మీదుగా మదీనా, పత్తర్ గట్టి, చార్మినార్, మక్కా మసీద్ల మీదుగా చౌమొల్లా ప్యాలెస్ వరకూ ప్రయాణించారు. యూరప్ దేశాల్లో కనిపించే ఈ వారసత్వ నడక దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో నిర్వహించడం విశేషం. ఈ యాత్రలో పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ముషరఫ్ అలీ పాల్గొన్నారు. పాతబస్తీలో శాంతి భద్రతలపై ఆరా తీశారు. ఐఏఎస్ అధికారులు స్థానిక పరిస్థితుల అడిగి తెలుసుకున్నారు. మొత్తం 12 మంది ఉన్నతాధికారులు ఇలా తమ ప్రాంతాలకు అశ్వంపై రావటం వల్ల స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఇవీచూడండి: 'సాధారణ స్థితికి వచ్చాకే కశ్మీర్ ఎన్నికలు'