ETV Bharat / state

BSP Telangana Election Campaign 2023 : హైదరాబాద్ వేదికగా ఎన్నికల సమర శంఖారావం పూరించిన బీఎస్పీ - హైదరాబాద్‌లో బీఎస్పీ సమావేశం

BSP Telangana Election Campaign 2023 : రాష్ట్రంలో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాలను విస్తృతం చేశాయి. గెలుపుపై లెక్కలు వేసుకుంటున్న తరుణంలో.. సోమవారం హైదరాబాద్‌ వేదికగా బీఎస్పీ ఎన్నికల నగారా మోగించింది. పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరాం 17వ వర్థంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ సభకు బీఎస్పీ జాతీయ సమన్వయకర్త, ఎంపీ రాంజీగౌతం, రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు. నవంబరు 30న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఇంటికి పంపించి బీఎస్పీ జెండా ఎగరేసి బహుజన రాజ్యం స్థాపిద్ధామని ఆ పార్టీ అగ్రనేతలు పిలుపునిచ్చారు.

BSP
RS Praveen Kumar
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2023, 11:24 AM IST

BSP Started Telangana Election Campaign హైదరాబాద్ వేదికగా ఎన్నికల సమర శంఖారావం పూరించిన బీఎస్పీ

BSP Telangana Election Campaign 2023 : తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన రోజే.. సోమవారం హైదరాబాద్ వేదికగా బీఎస్పీ ఎన్నికల నగారా మోగించింది. పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరాం 17వ వర్థంతిని పురస్కరించుకుని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన సంస్మరణ సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జాతీయ సమన్వయకర్త, ఎంపీ రాంజీగౌతం, రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ (RS Praveen Kumar) పాల్గొన్నారు.

BSP Focus on Telangana Assembly Elections 2023 : తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు తరలి వచ్చారు. తొలుత లక్డీకపూల్‌లోని ఆ పార్టీ కార్యాలయం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వరకు.. భారీ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికే 20 మంది అభ్యర్థులను ప్రకటించిన బీఎస్పీ.. త్వరలో మిగతా శాసనసభ స్థానాల్లో కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది. సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్.. ఇతర 19 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారాల్లో నిమగ్నమయ్యారు. ఊరూరా తిరుగుతూ తమను గెలిపించి అసెంబ్లీ పంపాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

'మౌనమే అంగీకారమా?.. విచారణ ఎందుకు ఇంత నత్తనడకన సాగుతోంది?'

రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం గల బహుజనులకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా.. పార్టీ పోరాడుతుందని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ పేర్కొన్నారు. కాన్షీరాం (Kanshi Ram) భారతదేశ రాజకీయాలను మలుపు తిప్పిన రాజకీయ యోధుడని.. భవిష్యత్ తరాల బహుజనులు పాలకులు కావాలని కలలుగన్న మహనీయుడని అన్నారు. ఆయన పేద ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా మిగిలిపోయారని తెలిపారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన కుటుంబాలపై దాడులు జరుగుతుంటే ఆయా వర్గాల ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.

సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రోద్భలం, ఒత్తిడితోనే.. వట్టే జానయ్య యాదవ్‌పై నిరాధారంగా పోలీసులు అక్రమ కేసులు పెట్టారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికలు కొండ చిలువలు, చలిచీమల మధ్య జరుగుతుందని బీఆర్ఎస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరో రెండు నెలలు పార్టీ శ్రేణులు రాత్రింబవళ్లు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు.

"ప్రజాబలం బీఎస్పీ వైపు ఉంది. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి. మాట తప్పేది లేదు..మడమ తిప్పేది లేదు. బీఆర్ఎస్‌ను ఇంటికి పంపిద్దాం. ఏనుగుపై ప్రగతి భవన్‌కు వెళ్దాం." - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై నీలి జెండా ఎగురవేయాలని బీఎస్పీ జాతీయ సమన్వయకర్త, ఎంపీ రాంజీగౌతం అన్నారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం గురించి మాట్లాడుతున్న బీజేపీ, కాంగ్రెస్.. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. హస్తం పార్టీ, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు పెరుగతున్నాయని రాంజీగౌతం మండిపడ్డారు.

RS Praveen Kumar Comments on KCR : "అసైన్డ్ భూముల బలవంతపు ఆక్రమణలపై త్వరలోనే హైకోర్టులో పిల్ వేస్తాం"

Telangana Assembly Elections 2023 : రాబోయే ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు చేసినా.. తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి రావడం ఖాయం అంటూ ఆ పార్టీ శ్రేణుల్లో నాయకత్వం ఉత్సాహం నింపే ప్రయత్నం చేసింది. రాజ్యాంగం పరిరక్షించే ఏకైక పార్టీ బీఎస్పీయేనని.. ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కలిసికట్టుగా నిరంతరం కష్టపడి అధికారం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చింది.

RSP Fires on CM KCR : 'కిసాన్ సర్కార్ అంటే పాడి రైతుల పొట్ట కొట్టడమేనా..?'

BSP meeting in Hyderabad: 'రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పాగా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.