BSF Defuse Landmines in AOB: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను స్వాధీనం చేసుకుని బీఎస్ఎఫ్ బలగాలు వాటిని నిర్వీర్యం చేశాయి. ఏవోబీలోని మల్కన్‌గిరి జిల్లా కటాఫ్ ఏరియాలో కొత్తగా ఏర్పాటైన బీఎస్ఎఫ్ బెటాలియన్ గొప్ప విజయాన్ని సాధించింది.
బీఎస్ఎఫ్ బలగాలు.. కటాఫ్ ఏరియాలో గాలింపు చర్యలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆంధ్రా సరిహద్దుల్లోని ఖొరిగండి అటవీప్రాంతంలో గొయ్యిని తవ్వి పెద్ద ఎత్తున నిల్వ చేసిన మావోయిస్టుల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 5 అతిపెద్ద మందుపాతరలు, ఇతర సామగ్రి ఉన్నాయి. మావోయిస్టులకు సంబంధించిన మరికొంత సమాచారం కోసం బీఎస్ఎఫ్ బలగాలు గాలింపు చర్యలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అదీ చదవండి: Traffic at Hyderabad-Vijayawada Highway : సెలవులొచ్చాయ్.. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ