ETV Bharat / state

బీఆర్ఎస్​ స్వేదపత్రం విడుదల కార్యక్రమం రేపటికి వాయిదా - Release of svedapatra postponed to Sunday

BRS Presentation Postponed Tomorrow : బీఆర్ఎస్ పాలనలో తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానంను వివరిస్తూ నేడు​ విడుదల చేయ తలపెట్టిన స్వేదపత్రం కార్యక్రమం రేపటికి వాయిదాపడింది. తెలంగాణ భవన్​లో బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వేదపత్రం పేరిట పవర్​పాయింట్ ప్రెజెంటేషన్​ ఇవ్వనున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2023, 3:58 PM IST

BRS Presentation Postponed Tomorrow : తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్(BRS) విడుదల చేయనున్న స్వేదపత్రం కార్యక్రమం ఆదివారానికి వాయిదా పడింది. మొదటగా ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని భావించినా వివిధ కారణాల రీత్యా రేపటికి వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక, ఇంధన రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం(Congress) శ్వేతపత్రాలు విడుదల చేసిన తరుణంలో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి అందుకు పోటీగా స్వేదపత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించింది.

తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీస్తే సహించేది లేదు: కేటీఆర్‌

BRS Svedapatram Postponed to Sunday : తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) ఇందుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. స్వయం పాలన ప్రారంభమైన తొమ్మిదిన్నరేళ్ల అనతి కాలంలోనే కేసీఆర్ ప్రభుత్వ దార్శనికతతో, యావత్ తెలంగాణ ప్రజలు చెమటోడ్చి సృష్టించిన సంపదపై స్వేదపత్రం విడుదల చేయనున్నట్లు బీఆర్ఎస్ పేర్కొంది. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం అని తెలిపింది.

లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ - ఎంపీలంతా హైదరాబాద్ రావాలని కేసీఆర్ ఆదేశాలు

పగలూ, రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీస్తే సహించబోమని కేటీఆర్ పేర్కొన్నారు. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించబోమన్న ఆయన అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని స్పష్టం చేశారు. అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు అప్పులు కాదు, తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆయా వర్గాలకు ఒనగూరిన లబ్ది, సృష్టించిన ఆస్తుల వివరాలు, విలువను స్వేదపత్రం ద్వారా వెల్లడించనున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వ హయంలో తీసుకొచ్చిన మార్పు వ్యవసాయం సహా వివిధ రంగాలకు సంబంధించి ప్రజల్లో అభద్రతను పోగొట్టి కల్పించిన స్థైర్యం, తద్వారా ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులను ఇందులో వివరించనున్నారు.

రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల ఇబ్బందులపై కార్మిక విభాగం ఆధ్వర్యంలో కమిటీ : రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ కమిటీ ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు పలు ఆందోళన కార్యక్రమాలు(Concern Programs) చేపడుతూ తమ స్థితిగతులపైన ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు కమిటీ వేసినట్లు వివరించారు.

కర్ణాటక సీఎం వీడియోపై కేటీఆర్ ట్వీట్ - తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సిద్ధరామయ్య

కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడుంది అసలు ఆట : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.