ETV Bharat / state

బండ బాదుడుపై రోడ్డెక్కిన బీఆర్‌ఎస్‌.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు - గ్యాస్‌ ధరల పెంపుకు వ్యతిరేకంగా తెలంగాణలో నిరసనలు

BRS Party Protest Against Gas Price Hike: వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ రోడ్డెక్కింది. ఖాళీ గ్యాస్ బండలతో రోడ్లపైకి వచ్చిన నాయకులు, కార్యకర్తలు.. ప్రధాన కూడళ్లలో ఆందోళన చేశారు. కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ నిరసన తెలిపారు. మహిళా దినోత్సవం కానుకగా.. మోదీ సర్కార్ గ్యాస్ రేట్లు పెంచిందని విమర్శలు గుప్పించారు.

BRS Party Protest Against Gas Price Hike

author img

By

Published : Mar 2, 2023, 9:22 PM IST

బండ బాదుడుపై రోడ్డెక్కిన బీఆర్‌ఎస్‌.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

BRS Party Protest Against Gas Price Hike: పెరిగిన గ్యాస్‌ ధరలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసనకు దిగాయి. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లో వంటా-వార్పు కార్యక్రమం చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ చౌరస్తా వద్ద మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్‌ఎస్‌ మహిళలు ఆందోళన నిర్వహించారు. ఎల్బీనగర్ చౌరస్తాలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎమ్మెల్యే వివేకానందరెడ్డి కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు. మలక్‌పేట్‌లో చేపట్టిన నిరసనల్లో హోంమంత్రి మహమూద్‌ అలీ పాల్గొన్నారు. నిత్యావసరాల ధరలు పెంచి పేదలపై పెనుభారం మోపుతున్నారని నేతలు మండిపడ్డారు.

రూ.10 పైసలు తగ్గించి.. రూ.100 పెంచుతున్నారు..: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో నిర్వహించిన ధర్నాలో మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. గతంలో గ్యాస్‌ ధర రూ.400 ఉంటే గగ్గోలు పెట్టిన బీజేపీ.. ఇప్పుడు మూడింతలు పెంచిందని హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికలు రాగానే గ్యాస్‌పై రూ.10 పైసలు తగ్గించి.. ఎన్నికలు అయిపోగానే రూ.100 పెంచడం బీజేపీకి ఆనవాయితీగా మారిందని ఆరోపించారు. పెట్రోల్‌, డీజిల్, గ్యాస్‌ సహా అన్ని రకాల నిత్యావసరాల ధరలు పెంచుతూ బీజేపీ ప్రజలను మోసం చేస్తోందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

''గతంలో గ్యాస్‌ ధర రూ.400 ఉంటే గగ్గోలు పెట్టిన బీజేపీ.. ఇప్పుడు దానిని మూడింతలు పెంచింది. ఎన్నికలు రాగానే రూ.10 పైసలు తగ్గించడం.. ఎన్నికలు అయిపోగానే రూ.100 పెంచడం బీజేపీకి ఆనవాయితీగా మారింది. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సహా అన్నిరకాల నిత్యావసరాల ధరలు పెంచుతూ బీజేపీ ప్రజలను మోసం చేస్తుంది.'' - మంత్రి హరీశ్‌రావు

కట్టెల పొయ్యే దిక్కయ్యేలా ఉంది..: పెంచిన గ్యాస్‌ ధరలకు వ్యతిరేకంగా నల్గొండ, జగిత్యాల జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళనకు దిగారు. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు వంటా-వార్పు కార్యక్రమాన్ని చేపట్టాయి. పెద్దఎత్తన పాల్గొన్న మహిళలు.. కేంద్రం తరచూ సిలిండర్‌ ధరలు పెంచూతూ సామాన్యుల నడ్డి విరుస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌లో చేపట్టిన ధర్నాలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌.. ఖాళీ సిలిండర్లతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర సర్కారు తీరుతో ప్రజలకు మళ్లీ పాత పద్ధతైన కట్టెల పొయ్యే దిక్కయ్యేలా ఉందని గులాబీ నేతలు విమర్శలు గుప్పించారు.

ఇవీ చూడండి..

గవర్నర్‌ వద్ద పెండింగ్ బిల్లులపై సుప్రీంను ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం

"రాష్ట్రపతి పాలన కోసం ఉమ్మడి పోరాటం చేద్దాం".. విపక్షాలకు వైస్​ షర్మిల లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.