BRS MLA Rekha Nayak Join Congress Today : బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యామ్‌నాయక్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి నివాసంలో హస్తం పార్టీలో చేరారు. శ్యామ్‌నాయక్‌ని రేవంత్‌రెడ్డి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా(KCR Announced 115 BRS Candidates)లో రేఖానాయక్‌కు చోటు దక్కలేదు. రేఖానాయక్ స్థానంలో జాన్సన్ రాథోడ్ నాయక్‌కు చోటు కల్పించారు. సీటు కోల్పోవడంతో రేఖానాయక్ భర్త శ్యామ్‌నాయక్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇవాళ ఉదయం రేఖానాయక్.. కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
Telangana Congress Assembly Ticket Application : మరోవైపు కాంగ్రెస్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు దాదాపు 220 మందివరకు దరఖాస్తు చేసినట్లు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న నాయకులు అనుచరులతో వచ్చి దరఖాస్తులు ఇస్తుండడంతో కార్యకర్తలు, నాయకులతో గాంధీభవన్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఆదివారం వరకి 36 దరఖాస్తులు రాగా.. శ్రావణ సోమవారంను మంచిరోజుగా భావించడంతో ఒక్కరోజే దాదాపు 180కి పైగా దరఖాస్తులు వచ్చినట్లు.. గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇంకా నాలుగు రోజులు సమయం ఉన్నా అర్జీలు ఇచ్చేందుకు నాయకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇవాళ్టి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
BRS MLA Candidates List 2023 : తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల యుద్ధానికి సమరం శంఖం పూరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తమ పార్టీ తరపున బరిలో నిలవబోయే గెలుపు గుర్రాల మొదటి జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలోనే ఏకంగా 115 మంది అభ్యర్థులకు (BRS MLA Candidates List 2023) టికెట్లు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ జాబితా ప్రకటనతో.. రాష్ట్రంలో ఎలక్షన్ సైరన్ మోగినట్లు అయింది. ఈ దఫా సిట్టింగుల్లో చాలా మందికి చోటు దక్కదనే ప్రచారం జరిగింది. దాదాపు 30 మంది వరకూ ఇంటికి వెళ్తారనే చర్చ జోరుగా సాగింది. కానీ అంచనాలను తారు మారు చేస్తూ.. స్వల్ప మార్పులు మాత్రమే కేసీఆర్ చేపట్టారు. కేవలం 7 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మారుస్తున్నట్టు ప్రకటించారు.
కొత్త రాష్ట్రమైన, వనరులు తక్కువగా ఉన్నా, అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ వజ్రంలా తెలంగాణను తీర్చిదిద్దుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అభివృద్ధికి కొలమానంగా చూసే తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో అగ్రస్థానంలో నిలిచామని గుర్తుచేశారు. ఈ ప్రగతిని కొనసాగించాలనే అజెండాతో ఎన్నికలకు వెళుతున్నామని.. 95 నుంచి 105 స్థానాలు గెలుస్తున్నామని సీఎం విశ్వాసం వ్యక్తంచేశారు.
BRS MLAs Final Candidates List 2023 : 2014 నుంచి కొనసాగుతున్నట్లుగానే మజ్లిస్‌తో స్నేహం ఉంటుందని.. ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రెండు పార్టీలు కలిసి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో 29స్థానాలు గెలుస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. కాంగ్రెస్, బీజేపీ అవినీతి ఆరోపణల్ని తిప్పికొట్టిన కేసీఆర్.. ఇప్పుడు ఎన్నికల్లో ప్రజలే తేల్చుతారని స్పష్టం చేశారు. ఉజ్వలమైన ఉత్కృష్టమైన తెలంగాణ సాధనలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని స్వీకరించాలని ప్రజల్ని కోరారు.