ETV Bharat / state

Joinings in Congress Party : ఓవైపు ఆకర్ష్.. మరోవైపు ఘర్​వాపసీ.. భారీ చేరికలపై కాంగ్రెస్ ఫోకస్ - కాంగ్రెస్​లో చేరనున్న బీజేపీ నాయకులు

BRS Leaders joins Congress : రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్ష నాయకులు కొత్తగా పార్టీల చేరికలపై కన్నేశారు. ఈ విషయంలో కాంగ్రెస్​ ముందంజలో ఉంది. బీఆర్​ఎస్​, బీజేపీ పార్టీ ముఖ్య నేతలను హస్తం గూటికి రప్పించేందుకు హస్తం పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల చివరి వారంలో పెద్ద ఎత్తున చెేరికలు ఉండే అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్​ పార్టీ వర్గాలు తెలిపాయి.

Joinings
Joinings
author img

By

Published : Jun 17, 2023, 8:28 AM IST

కాంగ్రెస్​లో పెద్దఎత్తున చేరనున్న బీఆర్​ఎస్​ నాయకులు

BRS Leaders To Join In Congress : తెలంగాణ కాంగ్రెస్​లో ఈ నెల చివరి వారంలో చేరికలు పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. ఖమ్మం, మహబూబ్​నగర్ జిల్లాల్లో నిర్వహించనున్న రెండు బహిరంగ సభల్లో చేరికలు ఉంటాయి. రాహుల్ గాంధీని కలిసిన తరవాత జూపల్లి, పొంగులేటిలు కాంగ్రెస్​లో చేరే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఇద్దరు ఎమ్మెల్సీలతోపాటు మరికొందరు పార్టీలో చేరతారని కాంగ్రెస్​ వర్గాలు వెల్లడించాయి.

Ponguleti Joins Congress : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిల బృందం కాంగ్రెస్​లో చేరడంపై స్పష్టత వచ్చింది. అదేవిధంగా బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి , పట్నం మహేందర్ రెడ్డిలు కూడా హస్తం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిల అనుచరులు ఐదారుగురు చేరనున్నారు. అందులో బీఆర్​ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్లనే ఈ నెల 21 తర్వాత రాహుల్ గాంధీతో కలిసి వారికిచ్చే సీట్లపై స్పష్టత తీసుకుని దిల్లీలోనే అధికారికంగా ప్రకటన చేస్తారని పీసీసీ వర్గాలు తెలిపాయి.

Congress Public Meeting In Khammam : పార్టీలో చేరికల ప్రకటన అనంతరం ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాహుల్​గాంధీ సమక్షంలో పొంగులేటితోపాటు అయన అనుచర గణం హస్తంపార్టీ కండువా కప్పుకుంటారు. అదేవిధంగా కొల్లాపూర్​లో కానీ, నాగర్​కర్నూల్​లో కానీ భారీ సభ పెట్టి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, జూపల్లి అనుచరగణం రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారు. బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూడా ఈ సభల్లోనే హస్తం పార్టీలో చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Jupally Joins Congress : జూన్​ 16వ తేదీన జూపల్లి కృష్ణారావుతో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కలిసినప్పుడు ఈ స్పష్టత వచ్చినట్లు ఆ తర్వాత చిట్​చాట్​లో ఆయన వెల్లడించారు. మరోవైపు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్​రెడ్డిని శుక్రవారం ఉదయం స్వయానా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించగా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆదివారం రోజున గాంధీభవన్​లో కాంగ్రెస్ పార్టీలో చేరతారని సమాచారం.

BRS MLC To Join In Congress : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ నాయకులతో టచ్​లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరుకాకుండా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన నాయకులను ఘర్​వాపసి పేరుతో హస్తం పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అన్న ఎంపీ వెంకటరెడ్డి ద్వారా కాంగ్రెస్​లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక గాంధీని కలిసినప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి ప్రస్తావన తీసుకురాగా రాష్ట్ర ఇంచార్జ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో చర్చించాలని ఆమె సూచించినట్లు తెలిసింది. బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే కూడా ఏఐసీసీ పెద్దలను తరచూ కలుస్తున్నట్లు తెలుస్తోంది. నెలాఖరున సభలు నిర్వహించి చేరికలు పూర్తయితే పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వస్తుందని, ఎన్నికల సమయానికి కొత్త చేరికలు పార్టీ శ్రేణుల్లో జోష్​ నింపుతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.