ETV Bharat / state

BRS Candidates First List of 2023 Assembly Elections : త్వరలోనే BRS ఎమ్మెల్యే అభ్యర్థుల​ తొలి జాబితా..! - BRS on Telangana Assembly Elections 2023

BRS Candidates First List of 2023 Assembly Elections : అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్​ఎస్​ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తోంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​ కొన్ని రోజులుగా సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 17 తర్వాత.. మంచి రోజున తొలి జాబితా ప్రకటించేందుకు గులాబీ దళపతి సిద్ధమవుతున్నారు. ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేయగా.. కొందరు నేతలైతే తమకు అధిష్ఠానం పచ్చజెండా ఊపిందంటూ ప్రచారమే మొదలు పెట్టేశారు. ఈసారి కేసీఆర్ కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతారని గులాబీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

BRS Candidates First list
BRS Candidates List in Assembly Elections
author img

By

Published : Aug 13, 2023, 7:03 AM IST

Updated : Aug 13, 2023, 8:18 AM IST

BRS Candidates First List of 2023 Assembly Elections త్వరలోనే BRS ఎమ్మెల్యే అభ్యర్థుల​ తొలి జాబితా..

BRS Candidates First List of 2023 Assembly Elections : భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల జాబితా సిద్ధమవుతోంది. ఈ నెల 17న ప్రారంభం కానున్న శ్రావణమాసంలో మంచి రోజున తొలి జాబితా ప్రకటించేందుకు గులాబీ దళపతి తుది కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్​, హరీశ్‌రావు కొన్ని రోజులుగా అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. పలు సర్వేలతో పాటు.. సామాజిక, రాజకీయ సమీకరణలు, ఇతర పార్టీల పరిస్థితి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను (BRS Candidates First List) ఖరారు చేస్తున్నారు.

2018 ముందస్తు ఎన్నికలప్పుడు ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ఇప్పుడు సుమారు 80 మందికి పైగా అభ్యర్థులను తొలి జాబితాలోనే వెల్లడించే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్​ఎస్​లో టికెట్ల కోసం తీవ్రమైన పోటీ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు అనేక మంది నేతలు టికెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గాల్లో పోటాపోటీ కార్యక్రమాలు చేస్తూ అధిష్ఠానం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు నేతలైతే ఎన్నికల పనులు చేసుకోవాలని తమకు అధిష్ఠానం హామీ ఇచ్చిందంటూ నియోజకవర్గాల్లో ప్రచారమే చేస్తున్నారు.

KCR to Contest from Kamareddy in Elections 2023 : కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా బరిలో సీఎం కేసీఆర్‌!

BRS Candidates First list : టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉన్నందున వీలైనంత ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని గులాబీ నాయకత్వం భావిస్తోంది. అభ్యర్థిపై అసంతృప్తి, అసమ్మతి కనిపిస్తే సరిదిద్దుకోవడానికి, నచ్చచెప్పడానికి తగిన సమయం ఉంటుందనే ఆలోచన చేస్తోంది. పార్టీ చెప్పినా వినకపోతే వదులుకోవాలనే కఠినమైన ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే మంచి రోజున పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం ఇస్తూనే.. కొంతమందిని మార్చే దిశగా బీఆర్​ఎస్​ అభ్యర్థుల ఎంపిక కసరత్తు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 103 మంది సిట్టింగ్‌ల్లో సుమారు పది, పన్నెండు మందిని మార్చవచ్చునని బలంగా వినిపిస్తోంది. పలు సర్వేల ఆధారంగా కొంతమంది ఎమ్మెల్యేలను కేసీఆర్ పిలిపించి.. వారు మార్చుకోవాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా మారని నేతలు, తరచూ వివాదాల్లో ఉంటున్న వారిని మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం.

KTR Comments On BJP And Congress : 'బీజేపీని గల్లాపట్టి గల్లీలో నిలదీయాలి.. డిపాజిట్లు గల్లంతు చేసి మోదీకి బుద్ధి చెప్పాలి'

BRS Strategies in Telangana Assembly Elections : వయోభారం, అనారోగ్య సమస్యలతో పాటు.. కోర్టు కేసుల్లో త్వరలో తీర్పులు ఎదుర్కోనున్న కొందరు నేతల విషయంలోనూ తర్జన భర్జన జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులందరికీ దాదాపుగా టికెట్లు ఖరారైనట్లే తెలుస్తోంది. కాంగ్రెస్(Congress), తెలుగుదేశం నుంచి బీఆర్​ఎస్​లో చేరిన ఎమ్మెల్యేల్లో దాదాపు అందరికీ అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి కామారెడ్డి (KCR to Contest from Kamareddy in Elections 2023) నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

BRS on Telangana Assembly Elections 2023 : కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మిగతా అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లోనూ సానుకూల ప్రభావం ఉంటుందన్న రాజకీయ కోణంలోనూ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కామారెడ్డి విషయంలో ఇంకా పార్టీ నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్సీ కవిత ఇటీవల పాత్రికేయుల ఇష్టాగోష్టిలో ప్రస్తావించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలున్న 15 స్థానాల్లో గతంలో పోటీ చేసిన వారు కాకుండా.. కొత్త వారిని బరిలోకి దించేలా కసరత్తు చేస్తున్నారు. మొత్తం మీద సుమారు 20 నుంచి 30 మంది కొత్త ముఖాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

BRS MLC Kavitha Fires on Bandi Sanjay : 'కరెంటు తీగలు పట్టుకొని చూడండి.. వస్తుందో లేదో తెలుస్తుంది'

BRS MP Nama Nageswararao Fires on Central Government : 'కేంద్రం సహకరించకున్నా.. తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది'

BRS on Telangana Assembly Elections 2023 : విపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా BRS దూకుడు.. హ్యాట్రిక్ దిశగా కేసీఆర్ కీలక నిర్ణయాలు

Last Updated : Aug 13, 2023, 8:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.