ETV Bharat / state

'అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే బంగారు తెలంగాణ సార్థకం' - బ్రహ్మకుమారీస్​

అందరిలో ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు బ్రహ్మకుమారీస్​ ఒక రోజు వైద్య సదస్సు నిర్వహించనుంది. ఈ నెల 16న గచ్చిబౌలిలో ఈ సదస్సును మంత్రి ఈటల రాజేందర్​ ప్రారంభించనున్నారని బ్రహ్మకుమారీస్​ ప్రతినిధి ఉమా బెహన్​ తెలిపారు.

brahmakumaris organizing medical confernce in hyderabad
'అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే బంగారు తెలంగాణ సార్థకం'
author img

By

Published : Feb 11, 2020, 5:11 PM IST

ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యం సాధించిన్నప్పుడే బంగారు తెలంగాణ సార్థకమవుతుందని బ్రహ్మకుమారీస్‌ అభిప్రాయపడ్డారు. అందరిలో ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు మహాశివరాత్రిని పురస్కరించుకొని సంస్థ ఒక రోజు వైద్య సదస్సు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈనెల 16న గచ్చిబౌలిలోని బ్రహకుమారీస్‌ గ్లోబల్‌ ఫీస్‌లో నిర్వహించే ఈ సదస్సును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించనున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ కూడా పాల్గొంటారని నిర్వాహకులు​ తెలిపారు.

ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్‌ వైద్య విభాగం, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ, ఇండియన్‌ మెడికల్‌ అసొసియేషన్‌, అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్‌ సైన్సెస్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఉమా బెహన్‌ తెలిపారు. ప్రపంచంలో ప్రతి మానవుడు శాంతియుతంగా, సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొంటారని ఆమె వివరించారు.

'అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే బంగారు తెలంగాణ సార్థకం'

ఇవీ చూడండి: ప్రభుత్వ నిర్ణయాలే అమలు చేయండి: ముఖ్యమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.