ETV Bharat / state

కంటోన్మెంట్​లో శరవేగంగా డబుల్​ బెడ్​రూం నిర్మాణ పనులు! - కంటోన్మెంట్ నియోజకవర్గం

కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మూడవ వార్డులో డబుల్​ బెడ్​రూం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని బోయిన్​పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ అన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఆదేశాల ప్రకారం డబుల్ బెడ్​రూమ్ నిర్మాణ పనులను పరిశీలించినట్టు ఆయన తెలిపారు.

Boyinpally Market Committee Chairman inspects Double bed Room Construction Works
కంటోన్మెంట్​లో శరవేగంగా రెండు పడకల ఇళ్లు నిర్మాణ పనులు!
author img

By

Published : Aug 29, 2020, 11:11 AM IST

కంటోన్మెంట్​ నియోజకవర్గంలోని మూడవ వార్డులో రెండు పడకల గదుల ఇంటి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే సాయన్న ఆదేశాల మేరకు బోయిన్​పల్లి మార్కెట్​ కమిటీ చైర్మన్​ టీఎన్​ శ్రీనివాస్, మాజీ మార్కెట్​ బోర్డు సభ్యుడు ప్రభాకర్​తో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని కాంట్రాక్టర్​కి సూచించారు. దీపావళి నాటికి అర్హులైన స్థానికులకు డబుల్​ బెడ్​రూం ఇళ్లు అందిస్తామని ఆయన తెలిపారు. ఇల్లు లేని పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం డబుల్​ బెడ్​రూం ఇల్లు నిర్మించి పేద ప్రజలకు అందిస్తున్నదని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.