ETV Bharat / state

Boyfriend killed Girlfriend in Bachupally : పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిన ప్రియురాలు.. వాటర్ ట్యాంకర్ కిందకు తోసి చంపిన ప్రియుడు - boyfriend killed girlfriend latest news

Boyfriend killed Girlfriend in Bachupally : వారివురు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రేమించిన యువతి.. తనను పెండ్లి చేసుకోవాలని ప్రియుడిపై ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ రచించాడు. ఈ క్రమంలోనే మాట్లాడుకుందామని పిలిచి.. ప్రియురాలిని వాటర్​ ట్యాంకర్ కిందికి తోసివేశాడు. దీంతో ఆ అమ్మాయి అక్కడిక్కడే ప్రాణాలు వదిలింది.

Boyfriend killed Girlfriend in Bachupally

author img

By

Published : Aug 6, 2023, 5:43 PM IST

Updated : Aug 6, 2023, 6:30 PM IST

Boyfriend killed Girlfriend in Bachupally : సమాజంలో రోజురోజుకు ఆడవారిపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. మహిళలు కనిపిస్తే చాలు.. క్రూరమృగాలుగా మారి అఘాయిత్యాలకు పాల్పడుతున్నవారు కొందరు. వావి వరసలు మరిచి అత్యాచారాలకు తెగబడుతున్నవారు మరికొందరు. ప్రేమిస్తున్నామంటూ వెంట పడతారు.. అమ్మాయి ఒప్పుకోకపోతే ఎంతకైనా తెగిస్తారు. తనకు అమ్మాయి దక్కలేదనే కక్షతో దాడులకు తెగబడుతున్నారు. అంతేకాదు.. ప్రాణాలు సైతం తీసేందుకు వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. కానీ ఇక్కడ జరిగింది వేరు.

వారివురు ప్రేమించుకున్నారు. కొంతకాలం బాగానే గడిచింది. ఆ యువతి తనను వివాహం చేసుకోవాలని సదరు యువకుడిపై ఒత్తిడి తెచ్చింది. మరోవైపు అతనికి వేరే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం ప్రేమించిన అమ్మాయికి తెలిసింది. దీనిపై ప్రియుడిని నిలదీసింది. ఎలాగైనా ప్రియురాలిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే మాట్లాడుకుందామని బయటకు పిలిచాడు. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పుడే అటుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ కిందికి ఆమెను తోసివేయడంతో.. అక్కడిక్కడే బాధితురాలు ప్రాణాలు వదిలింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్​లోని బాచుపల్లిలో చోటుచేసుకుంది.

Boyfriend killed Girlfriend  మృతురాలు ప్రమీల

యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది

Bachupally Road Accident Today : ప్రేమించిన యువకుడే ప్రియురాలిని ట్యాంకర్ ముందుకు తోసివేయడంతోనే మృతి చెందినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నెమలిగుట తండాకు చెందిన ప్రమీల.. బాచుపల్లిలో సేల్స్​గర్ల్​గా పనిచేస్తూ.. ఓ వసతి గృహంలో ఉంటుందని తెలిపారు. మరోవైపు అదేజిల్లాలోని రోడ్డు తండాకు చెందిన తిరుపతి హాఫీజ్​పేటలో ఉంటూ క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. ఈ క్రమంలోనే వీరివురు ఐదు నెలలుగా ప్రేమించుకుంటున్నారని వివరించారు.

a Lover Cut her young woman Throat : ఉప్పల్‌లో యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

ఈ నేపథ్యంలోనే ప్రమీల ఉంటున్న వసతిగృహం వద్దకు.. తిరుపతి వచ్చి వెళ్తుండేవాడని పోలీసులు తెలిపారు. నిందితుడుకి ఇటీవల నిశ్చితార్థం జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రమీల తనను వివాహం చేసుకోవాలని.. అతడిపై ఒత్తిడి తెచ్చిందని చెప్పారు. దీంతో ఎలాగైనా ఆమెను అడ్డుతొలగించుకోవాలని భావించిన అతను పథకం ప్రకారం.. ఈరోజు మాట్లాడుకుందామని పిలిచాడని వెల్లడించారు.

ఈ క్రమంలోనే ప్రమీలతో.. తిరుపతి గొడవకు దిగాడని పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే అటుగా రోడ్డుపైనుంచి వాటర్ ట్యాంకర్​గా వస్తుండగా.. యువతిని దాని కిందకు తోసివేశాడని వివరించారు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందిందని పోలీసులు తెలిపారు. అమ్మాయి మృతిని మొదట రోడ్డు ప్రమాదంగా భావించామని.. అక్కడి స్థానికులను విచారించగా ప్రియుడే ట్యాంకర్‌ కిందకి తోసినట్లు వెల్లడైందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు తిరుపతి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

అర్ధరాత్రి ఇంట్లో చొరబడి.. యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని కారుతో ఢీకొట్టి

Last Updated : Aug 6, 2023, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.