తెలంగాణ ప్రభుత్వం కేవలం హామీల వరకే పరిమితమైందని బౌద్ధనగర్ భాజపా అభ్యర్థి మేకల కీర్తి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బౌద్ధనగర్ డివిజన్ను దత్తత తీసుకొని ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. డివిజన్ పరిధిలోని అంబర్నగర్, పార్సిగుట్టలో పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పారు. భాజపాకు ఓటు వేయాల్సిందిగా కోరారు. డివిజన్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని తెలిపారు. భాజపా వంద సీట్లు గెలిచి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో 1,122 మంది