హైదరాబాద్ మాదాపూర్ వెస్టిన్ హోటల్లో ఈ క్యూబ్, బోధట్రీ సంస్థల ఆధ్వర్యంలో హోవార్డ్ డబ్ల్యూ. వారెన్ బఫెట్, విలియం బి ఎమ్కే రచించిన సోషల్ వాల్యూ ఇన్వెస్టింగ్( సామాజిక విలువ పెట్టుబడి) అనే ఆంగ్ల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ, ప్రైవేటు, దాతృత్వ రంగాల భాగస్వామ్యం ప్రాధాన్యతను తెలియజేస్తూ వాటిని అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఎమ్కే వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విశేషాలను తెలియజేస్తూ ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడే విధంగా రాసినట్లు తెలిపారు. సమాజం మీద మంచి ప్రభావం చూపుతూ లాభాలు పొందే విధంగా వ్యాపారం చేయాలనే అంశాన్ని ఈ పుస్తకంలో అద్భుతంగా ప్రస్తావించారని రచయిత పరకాల ప్రభాకర్ ప్రశంసించారు. అన్ని రంగాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
వెస్టిన్ హోటల్లో సామాజిక విలువ పెట్టుబడి పుస్తకావిష్కరణ - సామాజిక విలువ పెట్టుబడి)
హైదరాబాద్ మాదాపూర్ వెస్టిన్ హాటల్లో ప్రొ. ఎమ్కే తాను రచించిన సోషల్ వాల్యూ ఇన్వెస్టింగ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అన్నిరంగాలకు ఈ పుస్తకం బ్లూ ప్రింట్ లాగా ఉపయోగపడుతుందన్నారు.