ETV Bharat / state

లండన్​లో బోనాల సందడి. - లండన్​లో బోనాల సందడి.

లండన్ వీధుల్లో బోనాల జాతరను ప్రవాసులు ఘనంగా నిర్వహించారు. తొట్టెల ఊరేగింపు, పోతురాజుల చిందులతో లండనంతా గల్లుమంది. మహిళలందరు భారీ సంఖ్యలో బోనాలతో గోల్కొండ బోనాల మాదిరిగా ప్రదర్శించారు.

లండన్​లో బోనాల సందడి.
author img

By

Published : Jul 14, 2019, 5:03 AM IST

లండన్​లో బోనాల సందడి.

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్​డమ్​.. లండన్‌లో బోనాల జాతర ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుంచి సుమారు 800 మందికి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. స్వదేశంలో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు చేశారు. లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు, పోతురాజుల ఆటలు చూపరులను ఆకట్టుకున్నాయి. యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటున్నారని.. వీరి స్ఫూర్తి చాలా గొప్పదని భారత సంతతికి చెందిన అక్కడి ఎంపీ వీరేంద్ర శర్మ అన్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పదన్నారు. సాంప్రదాయ తెలంగాణా వంటకాలతో పండగ నిర్వహించడం ఆనందంగా ఉందని వీరేంద్రశర్మ హర్షం వ్యక్తం చేశారు.

అమ్మవారికి బోనం సమర్పించడానికి మహిళలు బోనం ఎత్తుకొని లండన్ వీధుల్లో తిరిగారు. వారిని నిర్వాహకులు ప్రత్యేకంగా సత్కరించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి అతిథిలుగా హాజరైన అక్కడి ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా , రూత్ కాడ్బరి , ఇండియన్ హైకమిషన్ ప్రతినిధి ప్రేమ్ జీత్, హౌన్సలౌ డిప్యూటీమేయర్ రాగ్విందర్ సిద్ధులను నిర్వహకులు సత్కరించి జ్ఞాపికను అందజేశారు. తెలంగాణ చిన్నారులు, కమిటీ మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ సభ్యులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించించాయి.

ఇదీ చూడండి'ఆ ఇద్దరూ ఉంటే పార్టీలో ఎవరూ మిగలరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.