కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకపోవటం దురదృష్టకరమని... భాజపా నాయకుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని ఆత్మహత్య చేసుకున్న బోడ సునీల్ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని... హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద వివిధ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వత్తులు వెలిగించి మౌనం పాటించారు.
తెలంగాణ ఏర్పడ్డాక నియామకాలు ఉంటాయని భావించిన యువతకు నిరాశే మిగిలిందని తెలిపారు. తెలంగాణ కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు రాలేదని అవి ఆంధ్రాకు పోయాయని... నీళ్లు ఫామ్ హౌస్కు పోతున్నాయని ఎద్దేవా చేశారు. విద్యార్థి మరణానికి లక్ష రూపాయలు ఇస్తామని మంత్రి చెప్పడం దురదృష్టకరమన్నారు. కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష 92 వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఆ పిల్లలకు ఆయనే అమ్మానాన్నా!