రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని హిమాయత్ నగర్ గ్రామ సమీపంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి హాజరయ్యారు. రక్తదానం ఒకరికి ప్రాణం ఇవ్వటం లాంటిదని ఏసీపీ అశోక్ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. ఎంతో అభినందనీయమైన ఈ కార్యక్రమం నిరంతరం జరిగితే ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వారవుతారని తెలిపారు.
మండలలోని యువత సామాజిక కార్యక్రమాల్లో ముందు ఉండడం చాలా సంతోషంగా ఉందని మొయినాబాద్ సీఐ జానయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులు రక్తదానం చేశారు.
ఇదీ చదవండి: మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్ కిక్కు.. ఒక్కరోజే డబుల్