మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో మెగా రక్తదాన శిబిరాన్ని తెతెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ ప్రారంభించారు. అంతకుముందు ఎన్టీఆర్ భవన్లో ఉన్న ఆయన విగ్రహానికి తెదేపా నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
పేదరిక నిర్మూలన, పేదలకు ఆహారభద్రత లాంటి చట్టాలు తయారుచేసినప్పుడే ఎన్టీఆర్కు నిజమైన నివాళులర్పించనట్లని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ సినీపరిశ్రమంలో మకుటంలేని మహారాజుగా ఎదిగి... పేదలకు సేవచేయాలనే ఉద్దేశంతో తెదేపా స్థాపించిన గొప్ప వ్యక్తి అని ఎల్ రమణ కొనియాడారు.
ఇవీ చూడండి: పత్తికి అదనంగా రూ.275 పెంచండి!