రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అక్రమాలను నివారించేందుకు ప్రభుత్వం 'బ్లాక్ చెయిన్ టెక్నాలజీ' అనే నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ధాన్యం రవాణా, బియ్యం సరఫరా, గోనె సంచుల వినియోగంలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు పౌర సరఫరాల సంస్థ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సంస్థకు చెందిన గోనె సంచులు ఎక్కడా కూడా దుర్వినియోగం కాకుండా ప్రతి సంచికి బార్ కోడింగ్ ఇస్తారు. ప్రతి బ్యాగుకు క్యూఆర్ కోడ్ ట్యాగ్ అటాచ్ చేస్తారు. ఈ కోడ్‌ను స్మార్ట్ ఫోన్ ద్వారా స్కాన్ చేసి వచ్చిన సమాచారం ఐటీఈ అండ్ సి సర్వర్‌లో నిక్షిప్తం చేస్తామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ఈ వినూత్న విధానం దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణలో అమల్లోకి రానుంది. ఈ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ప్రయోగాత్మకంగా సిద్దిపేట ధాన్యం కొనుగోలు కేంద్రం, గజ్వేల్లోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో ఈ విధానాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు.
ఇదీ చూడండి: 5 కెమెరాలతో షియోమీ నుంచి సూపర్ బడ్జెట్ ఫోన్!