ETV Bharat / state

నగరంలో చాప కింద నీరులా బ్లాక్‌ ఫంగస్‌!

హైదరాబాద్‌ నగరంలో మ్యూకో మైకోసిస్‌(బ్లాక్‌ ఫంగస్‌) బాధితుల సంఖ్య చాపకింద నీరులా పెరుగుతోంది. కరోనా తొలివిడతలో ఈ కేసులు తక్కువగా కన్పించాయి. రెండో దశలో ఎక్కువ మంది ఈ సమస్యతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఐసీయూల్లో చికిత్స తీసుకోవడం, అధిక స్టెరాయిడ్లు వాడటం వల్ల కరోనా నుంచి కోలుకున్న తర్వాత బ్లాక్‌ ఫంగస్‌ దాడి చేస్తోంది.

black fungus victims increasing in Hyderabad
చాప కింద నీరులా బ్లాక్‌ ఫంగస్‌!
author img

By

Published : May 13, 2021, 10:56 AM IST

వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. మధుమేహుల్లో ఎక్కువ ప్రభావం చూపుతోంది. గడిచిన రెండు నెలల్లో నగరంలోని ఓ ప్రైవేటు ఈఎన్‌టీ ఆసుపత్రిలో పదుల సంఖ్యలో బాధితులు ఈ సమస్యతో చేరారు. శస్త్ర చికిత్సలతో కొందరిలో అడ్డుకట్ట వేయగా, మరికొందరిలో ప్రమాదకరంగా మారింది. తాజాగా మూసాపేటలోని ఓ ఆసుపత్రిలో బ్లాక్‌ ఫంగస్‌తో చేరిన 25, 42, 63 ఏళ్ల ముగ్గురు వ్యక్తులకు వైద్యులు శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ సమస్యతో బాధితులు చేరుతున్నారు. లక్షణాలు కన్పించిన వెంటనే ఆలస్యం చేయకుండా ఈఎన్‌టీ, దంత, నేత్ర వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

కేసులు పెరుగుతున్నాయి:

బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారిలో చాలా వరకు కొవిడ్‌ లక్షణాలే కనిపిస్తాయి. తొలుత ముక్కులో కనిపిస్తుంది. క్రమంగా కళ్లు అక్కడి నుంచి మెదడుకు వ్యాపిస్తుంది. ఇది చాలా అరుదైనది. కరోనా బారిన పడి అధిక మోతాదులో స్టెరాయిడ్లు వాడిన వారికి బ్లాక్‌ ఫంగస్‌తో ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ముగ్గురు బాధితులు ఇటీవల ఈ సమస్యతో ఆసుపత్రిలో చేరారు. వెంటనే శస్త్ర చికిత్సతో ప్రాణాలు కాపాడాం. - డాక్టర్‌ భార్గవ్‌ ఇలపకుర్తి; తల, మెడ శస్త్రచికిత్స నిపుణులు

నేత్రాలకు పెను ప్రమాదం

కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న తొలి దశలో బ్లాక్‌ ఫంగస్‌ రావొచ్ఛు ఇది ముఖంలోని గదులు, కళ్లు, మెదడుపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తుల నోటి, శ్వాస నాళాల వద్ద మ్యూకోర్‌ ఉన్నప్పటికీ రోగ నిరోధక వ్యవస్థ వల్ల ఇది ఇన్‌ఫెక్షగా మారదు. ప్రస్తుతం కొవిడ్‌ కారణంగా శరీరంలో తెల్ల రక్త కణాలు తగ్గుతున్నాయి. మ్యూకోర్‌, శరీరంపై దాడి చేయడంతో పాటుగా శరీర కణాల్లోకి చేరుతోంది. నేత్రాలను దెబ్బ తీస్తుంది. కొన్నిసార్లు కనుగుడ్డును తొలగించాల్సి వస్తుంది. - డాక్టర్‌ తర్జానీ వివేక్‌ దవే, సీనియర్‌ ఆప్తమాలజిస్ట్‌

దవడ నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు

బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా దవడ భాగంలో నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయొద్ధు కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో ఈ సమస్య కనిపిస్తే.. అసలే నిర్లక్ష్యం వద్ధు రెండో విడతలో ఎక్కువ మంది ఈ సమస్యతో ఆసుపత్రులకు వస్తున్నారు. సమస్య ఉంటే.. ముందుగానే మేల్కొని ఈఎన్‌టీ, దంత, నేత్ర సంబంధిత నిపుణులను సంప్రదిస్తే తగిన సూచనలు, సలహాలు అందిస్తారు. - డాక్టర్‌ ప్రసాద్‌ మేక, సీనియర్‌ దంత వైద్యులు

ఇదీ చదవండి: ఇంటింటి సర్వేలో వెలుగులోకి వచ్చిన కరోనా బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.