జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తార్నాక డివిజన్ అభ్యర్థి బండ జయసుధారెడ్డి ఇంటింటికి తిరిగి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని మాణికేశ్వరనగర్, ఓయూ ప్రాంతాల్లో పర్యటించారు.
తెరాస ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని ఆమె అన్నారు. గ్రేటర్లో భాజపాను గెలిపిస్తే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎవరిని పలకరించినా భాజపాదే విజయం అంటున్నారని జయసుధారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.