అంతర్వేది దేవాలయంలో రథం దగ్ధం కావడంపై తెలంగాణ భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌విఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీలో ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. రథం దగ్ధం కావడం ముమ్మాటికి కుట్రపూరితమే అని ఆరోపించారు.
రథం దగ్ధం కావడంపై వైకాపా పార్టీ శ్రేణులు, మంత్రుల చులకనగా మాట్లాడారని తప్పుబట్టారు. మంత్రులు వెంటనే బహిరంగా క్షమాపణ చెప్పాలని.. సీఎం జగన్ మోహన్‌రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో అన్యమత ప్రచారం, అంతర్వేదిలో రథం దగ్ధం కావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: విద్యుదాఘాతంతో యువకుడు మృతి