ఐదు రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను పార్టీ సంస్థాగత విషయాలను చర్చించేందుకు ఇటీవల పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కృష్ణదాస్‌తో సమావేశమయ్యారు.
వైద్యపరీక్షల్లో కృష్ణ దాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు బండి సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఈ విషయాన్ని స్పీకర్‌కి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సమాచారం అందించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా