ETV Bharat / state

నిజమైన ఉద్యమకారులు ఉన్న పార్టీ భాజపా: బండి సంజయ్ - Bandi sanjay Comments

నాగోల్ జె కన్వెన్షన్‌లో భాజపా నిర్వహించిన ''అమరుల యాదిలో ఉద్యమ ఆకాంక్షల సాధన సభ''లో బండి సంజయ్ పాల్గొన్నారు. నిజమైన ఉద్యమకారులు ఉన్న పార్టీ భాజపా మాత్రమేనని పేర్కొన్నారు. కేసీఆర్‌ను, తెరాసను బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు సూచించారు.

bjp state president Bandi sanjay fires on cm kcr and trs
నిజమైన ఉద్యమకారులు ఉన్న పార్టీ భాజపా: బండి సంజయ్
author img

By

Published : Jun 2, 2022, 4:34 PM IST

నిజమైన ఉద్యమకారులు ఉన్న పార్టీ భాజపా మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. మలిదశ ఉద్యమం చేపట్టి తెలంగాణ ఆకాంక్షలను నెరవేరుస్తామని తెలిపారు. హైదరాబాద్‌ పరిధిలోని నాగోల్ తట్టి అన్నారం జె కన్వెన్షన్‌లో భాజపా అధ్వర్యంలో నిర్వహించిన ''అమరుల యాదిలో ఉద్యమ ఆకాంక్షల సాధన సభ''లో సంజయ్‌ మాట్లాడారు.

కొంతమంది మూర్ఖులు తెలంగాణ చరిత్రను రూపుమాపాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇలా పదవుల కోసమే ఉద్యమ ద్రోహులు చేస్తున్నారని విమర్శించారు. వాస్తవ చరిత్రను తెలిపేందుకు ఈ సభను ఏర్పాటు చేసినట్లుగా బండి సంజయ్‌ పేర్కొన్నారు. మూర్ఖపు ముఖ్యమంత్రిని, తెరాసను బంగాళాఖాతంలో కలపాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. ''తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధించాం..'' అని ప్రజలు బాధపడుతున్నారంటే కేసీఆర్ నిరంకుశపాలనే కారణమన్నారు. రాష్ట్రంలో కొత్త తరహా ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు.

''కొంతమంది మూర్ఖులు తెలంగాణ చరిత్రను రుపుమాపు చేయాలని చూస్తున్నారు. పదవుల కోసం ఉద్యమ ద్రోహులు ఇలా చేస్తున్నారు. వాస్తవికతను తెలియ చెప్పేందుకే ఈ సభ. ఈ ముఖ్యమంత్రిని, తెరాసను బంగాళాఖాతంలో కలపాలి. నిజమైన ఉద్యమకారులు ఉన్న పార్టీ భాజపా. ఇది తెలంగాణ పోరాట వీరుల సభ. ఉద్యమ ద్రోహులే మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. తెలంగాణలో కొత్త తరహా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగ ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మలిదశ ఉద్యమం చేసి తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుస్తాం.'' - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.