ETV Bharat / state

కేసీఆర్​ తన వైఫల్యాలను ఒప్పుకోవడం తప్ప చేసిందేమి లేదు: బండి సంజయ్​ - అపెక్స్​ కౌన్సిల్​ సమావేశం సందర్భంగా కేసీఆర్​పై బండి సంజయ్ విమర్శలు

సీఎం కేసీఆర్​పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ తీవ్ర విమర్శలు గుప్పించారు. అపెక్స్​ కౌన్సిల్​ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుమ్మక్కై బయటకి వచ్చి ఏపీని హెచ్చరించానని కేసీఆర్​ హెచ్చులు కొట్టడం సిగ్గుమాలిన చర్యగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ తన వైఫల్యాలను, తప్పులను ఒప్పుకోవడం తప్ప అపెక్స్ సమావేశంలో సాధించింది ఏమి లేదని దుయ్యబట్టారు.

కేసీఆర్​ తన వైఫల్యాలను ఒప్పుకోవడం తప్ప చేసిందేమి లేదు: బండి సంజయ్​

author img

By

Published : Oct 6, 2020, 11:40 PM IST

అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పిల్లిలా వ్యవహరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు వచ్చి పులిలా అబద్ధపు ప్రకటనలు చేస్తున్నాడని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. లోపల ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుమ్మక్కై బయటకి వచ్చి ఏపీని హెచ్చరించానని హెచ్చులు కొట్టడం సిగ్గుమాలిన చర్యగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సుప్రీం కోర్టులో కేసు వేసిన తర్వాత ట్రిబ్యునల్ సాధ్యం కాదని తెలిసి ఎందుకు ఇన్ని రోజులు ట్రిబ్యునల్ కావాలని కాలయాపన చేశారని బండి సంజయ్​ ప్రశ్నించారు. రెచ్చగొట్టే అసత్య ప్రకటనల ద్వారా తెలంగాణకు చేసిన అన్యాయాన్ని కప్పిపుచ్చలేరన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటె పోతిరెడ్డిపాడును అజెండాలో ఎందుకు చేర్చలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తన వైఫల్యాలను, తప్పులను ఒప్పుకోవడం తప్ప అపెక్స్ సమావేశంలో సాధించింది ఏమి లేదని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: కేసీఆర్ అతిపెద్ద తెలంగాణ ద్రోహి: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.